29.7 C
Hyderabad
April 29, 2024 08: 59 AM
తెలంగాణ

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: ఎమ్మెల్యే బీరం

kolla mla 11

విద్యార్థులందరూ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం కొల్లాపూర్ పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పుస్తకాల ద్వారా విజ్ఞానం పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రత్యేక చొరవతో  గురుకుల పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి విద్యార్థులను పరిపూర్ణులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి విద్యార్థి  చదువుపై దృష్టి కేంద్రీకరించి ఉన్నతస్థాయిలో ఉండాలన్నారు. పుస్తకాలను చదవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యారంగ పటిష్టత కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. అనంతరం పుస్తక  ప్రదర్శనను ఆయన పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ గాదెల సుధారాణి, మార్కెట్ చెర్మెన్ నరేందర్ రెడ్డి, జడ్పీటీసి భాగ్యమ్మ, జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మతీన్, హాస్పిటల్ చెర్మెన్ కాటం జంబులయ్య, పాఠశాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Related posts

వెరైటీ: బస్సు కాదు గురూ బయో టాయిలెట్టు

Satyam NEWS

కమలం క్యాడర్ నెత్తిన కొత్త నేతలు

Satyam NEWS

బ్రహ్మచారిణిగా బాసర జ్ఞాన సరస్వతి

Satyam NEWS

Leave a Comment