38.2 C
Hyderabad
April 29, 2024 12: 56 PM
Slider నెల్లూరు

వి ఎస్ యూనివర్సిటీ లో జాతీయ ఐక్యత దినోత్సవం

#vikramsimhapuri

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో జాతీయ ఐక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ గా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారతదేశం ప్రథమ హోం శాఖ మంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్  జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  

ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ డా. పి రామచంద్రా రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరోచిత  సంకల్పం గొప్పది అందువలనే ఈ రోజు భారత దేశం కలిసి ఉందని తెలిపారు. స్వాతంత్య్రం రాక ముందు ఎన్నో చిన్న రాజ్యాలుగా విడిపోయిన వున్నావాటిని తీసుకువచ్చి  ఒక పెద్ద దేశంగా ఏర్పడటానికి కృషి మరువలేనిదని అన్నారు. మనందరం కూడా కలిసికట్టుగా భారత దేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరారు.

మొదట మనం భారతీయులమని తర్వాతే  ప్రాంతీయులమని అన్నారు. కులమైన, వర్ణమైన, మతమైనా మరి ఏ దేనిచేత నైనా మనం విడిపోకుండా అందరు కలిసి మెలిసి ఐక్యతతో దేశ  పరిరక్షణకు, సమైక్యతకు పాటుపడాలని కోరారు. క్లీన్  ఇండియా భాగంగా జిల్లా చేపట్టిన వివిధ కార్యక్రమాల పై సంతృప్తి వ్యక్తపరచారు. అనంతరం ఎన్ ఎస్ ఎస్ సమన్వయ కర్త డా.ఉదయ్ శంకర్ అల్లం, విశ్వవిద్యాలయం అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల చేత ఐక్యతా దినోత్సవ  ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య జి విజయ ఆనంద కుమార్ బాబు, ఆచార్య సుజా ఎస్ నాయర్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. కె. ప్రభాకర్, డా. సుజయ్, డా. హనుమ రెడ్డి, ఎన్ వై కె  డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, డా. ఏ మహేంద్ర రెడ్డి మరియు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Related posts

అమెరికా వెలగాలంటే ఇండియాతోనే ఉండాలి

Satyam NEWS

దళారులకు అమ్ముకున్న వరి రైతులను కూడా ఆదుకోవాలి

Satyam NEWS

దొంగనోట్ల కేసులో వైసీపీ మహిళానేత అరెస్టు

Satyam NEWS

Leave a Comment