29.7 C
Hyderabad
May 1, 2024 07: 21 AM
Slider నిజామాబాద్

పల్లె ప్రగతి: సేంద్రియ ఎరువు తయారీపై శిక్షణ

#Bichkunda Farmers

బిచ్కుంద మండలం రాజుల్లా గ్రామంలో సేంద్రియ ఎరువుల తయారీ పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ జిల్లా కోర్డినేటర్ శంకర్ పలు అంశాలపై సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు.

సర్పంచ్లు కార్యదర్శులు పల్లె ప్రగతిలో ఇచ్చిన పది సూత్రాలను కచ్చితంగా పాటించాలని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉన్నందు వలన ప్రతి ఒక్కరు వాటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ట్రాక్టర్లో  తీసుకువచ్చిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులు వాటిని వేరు చేస్తారన్నారు.

తడి చెత్త పొడి చెత్త ద్వారా ఏరువులు తయారయిన అనంతరం వాటిని రైతులకు అమ్ముకోవచ్చన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు కొనుగోలు చేయకపోతే తామే వాటిని కొనుగోలు చేస్తామన్నారు. పంచాయతీ రాజ్ చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలపై కచ్చితంగా పాటించాలన్నారు. ప్రత్యేకంగా ఆరు సూత్రాలను కచ్చితంగా గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలన్నారు.

1)హరితహారంలో నాటిన మొక్కలకు నష్టం చేస్తే ఐదు వందలు జరిమానా విధించాలని

2)బహిరంగంగా మల మూత్ర విసర్జన చేస్తే ఐదువందల నుండి 1000రూపాల వరకు జరిమనా విధించాలని

3)కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించకపోతే వారిని కూడా జరిమానా విధించి వచ్చన్నారు.

4)ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా యాభై మైక్రాన్ల కంటే అధికంగా ప్లాస్టిక్ వాడిన వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి గ్రామ పంచాయితీకి సర్వహక్కులు ఉన్నాయన్నారు.

5)బహిరంగంగా ఉమ్మి వేసిన కూడా జరిమానా విధించేలా తీర్మానం చేయాలని స్పష్టం చేశారు. గ్రామంలో ఎవరు కూడా అనారోగ్య బారిన పడకుండా చూసే బాధ్యత పంచాయతీ కార్యదర్శుల సర్పంచ్ లేదనని పై విషయాలపై జరిమానాలు విధించినా అనంతరం రికార్డుల నిర్వహణ తప్పకుండా చేయాలన్నారు.

పల్లె ప్రగతిలో పది ప్రమాణాలు పాటిస్తే గ్రామాలు అద్భుతంగా తయారవుతాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇతర పలు అంశాలపై  కొన్నింటిని ఉదాహరణలతో విశదీకరించిన అనంతరం చిత్రమాలిక ద్వారా మరికొన్ని విషయాలను  వివరించారు. అనంతరం ఒక్కొక్క సర్పంచ్ ఒక్కొక్క మొక్క నాటే విధంగా  గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతి గ్రామ  సర్పంచ్  మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్ ఎంపిడిఓ ఆనంద్ ఎంపిఓ మహబూబ్ జడ్పిటిసి భారతి రాజు, గ్రామ సర్పంచ్ చంద్రభాగ అశోక్ తో పాటు అయా గ్రామాల సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య కార్మికులు వాటర్మెన్ల పాల్గొన్నారు.

Related posts

మహిళల్ని బానిసలుగా చూసిన సంఘటనపై కేసు నమోదు చేయాలి

Satyam NEWS

తెలుగు ప్రజలకు భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు…!

Satyam NEWS

నాదెండ్ల మనోహర్ ను చూస్తే వారికి భయం

Satyam NEWS

Leave a Comment