40.2 C
Hyderabad
April 28, 2024 15: 31 PM
Slider జాతీయం

కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పనున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్ధూపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆప్ లో చేరే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే, సిద్ధూతో చివరిసారి చర్చలు జరిపిన విషయాన్ని వెల్లడించేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు.

కేజ్రీవాల్ మళ్లీ కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రకటనతో పంజాబ్‌లో సిద్ధూ ఆప్‌లో చేరడంపై కేజ్రీవాల్ చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని వీడాలని సిద్ధూ పలుమార్లు ప్రయత్నించిన సంగతి తెల్సిందే.

కాంగ్రెస్ పార్టీతో సిద్ధూ సంతృప్తిగా లేరు. పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక పంజాబ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని చాలాసార్లు సిద్ధూ ప్రయత్నించారు. సిద్ధూ 2022 తర్వాత తానే పంజాబ్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నా.. కాంగ్రెస్ పార్టీలో అందుకు గ్యారెంటీ లేదు.

పంజాబ్‌లో ఆప్ సీఎం అభ్యర్ధి కోసం వేచి ఉంది. పంజాబ్‌లో ఆప్ పరంగా అతిపెద్ద చర్చ సీఎం ఎవరనే విషయం మీదే. సీఎం పదవి సిక్కు వర్గానికి చెందినవారికి ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్ ఇప్పటికే చెప్పారు. కానీ, ఆయన పేరును వెల్లడించలేదు. సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ గురించి ఖచ్చితంగా పార్టీలో చర్చ జరుగుతోంది, కానీ కేజ్రీవాల్ బహిరంగంగా ఏమీ చెప్పడం లేదు.

Related posts

అగ్లీ సీన్స్: అనుచితంగా ప్రవర్తించిన మంత్రులు

Satyam NEWS

సీపీఐ, సీపీఎం నేత‌ల అరెస్టు

Sub Editor

రేపు ముంబాయికి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌

Satyam NEWS

Leave a Comment