32.7 C
Hyderabad
April 26, 2024 23: 47 PM
Slider నెల్లూరు

300 కోట్ల రూపాయలతో కోవూరులో నీటిపారుదల ప్రాజెక్టులు

#AadalaPrabhakarReddy

నెల్లూరు జిల్లా కోవూరు ప్రజలు మొదటి నుంచి చైతన్యవంతులని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. ఆదివారం  కోవూరు నియోజకవర్గంలో జరిగిన ఏడు కార్యక్రమాల ప్రారంభోత్సవంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానేత నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి హయాం నుంచి కూడా కోవూరు ప్రజలు చాలా చైతన్యంతో ఉంటూ వస్తున్నారని, అది ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు. అందువల్లనే నియోజకవర్గంలో అభివృద్ధి కనిపిస్తోందని ప్రస్తుతించారు.

నెల్లూరు జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే కోవూరు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కనిపిస్తుందని  అభినందించారు.ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఎప్పటికప్పుడు అవసరాలు పుట్టుకు వస్తున్నాయని, వాటిని కూడా తీర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రానున్న రెండేళ్లలో ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.  వైసిపి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఒక పక్క ఆర్థిక సమస్యలున్నా ఆ విషయంలో రాజీ పడటం లేదని కొనియాడారు.

కోవూరు నియోజకవర్గానికి నీటిపారుదల రంగానికి 300 కోట్ల రూపాయలు కేటాయించారని, త్వరలో అవి కార్యరూపం దాలుస్తాయని పేర్కొన్నారు. పెన్నా నది పైన ముదివర్తి వద్ద వంద కోట్లతో బ్యారేజ్ నిర్మాణం జరగనుందని తెలిపారు. నియోజకవర్గంలో నిర్మించిన గ్రామ సచివాలయాలు ఎంతో అందంగా నిర్మించారని ప్రశంసించారు దీనికీ సీఎం జగన్ శ్రద్ధ కారణమని అభిప్రాయపడ్డారు.

ఇది జిల్లా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెల్లించడం సమంజసమని అభిప్రాయపడ్డారు. అంతకుముందు కోవూరు నియోజకవర్గంలో 25 లక్షల రూపాయల తన ఎంపీ నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్లను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

అలాగే సుబ్బారెడ్డి పురంలో సిమెంట్ రోడ్డు ను ప్రారంభించారు. వేగురు- పల్లి పాలెంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కోవూరు లోని  స్టా బీడీ కాలనీలో వాటర్ ప్లాంట్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.

అంతకుముందు యువకులతో బైక్ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమాల్లో స్థానికులల అవసరాలు తెలుసుకుని వాటికి హామీలిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, డిసిఎంఎస్ అధ్యక్షుడు వీరి చలపతి, మాజీ కార్పొరేటర్లు స్వర్ణ వెంకయ్య, నూనె మల్లికార్జున యాదవ్, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి,   దొడ్డం నిరంజన్ రెడ్డి సుధాకర్ రెడ్డి, టి చంద్రశేఖర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మిస్‌ ఇండియా ఓ అమ్మాయి ఛాలెంజింగ్‌ జర్నీ

Satyam NEWS

ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ

Bhavani

న్యూ డైమన్షన్: పాత సచివాలయం నుంచి స్కై వాకర్?

Satyam NEWS

Leave a Comment