28.7 C
Hyderabad
April 28, 2024 10: 28 AM
Slider ప్రత్యేకం

న్యూ డైమన్షన్: పాత సచివాలయం నుంచి స్కై వాకర్?

burgula secratariat

ఖాళీ చేసిన సచివాలయం మళ్లీ తెరుస్తారా? ఏమో చెప్పలేం కానీ ఒక నూతన పరిణామం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సచివాలయ భవనాలను ఖాళీ చేసి అన్ని కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్ కు అందుబాటులో ఉన్న మరి కొన్ని భవనాలకు తరలించారు. అక్కడ నుంచి పనులు కూడా అన్ని శాఖలు ప్రారంభించి పని చేస్తున్నాయి. చాలా అసౌకర్యంగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం కాబట్టి ఎవరూ కనీసం నిరసన కూడా వ్యక్తం చేయకుండా తరలి వెళ్లిపోయారు.

అసలు సచీవాలయానికే రాని ముఖ్యమంత్రికి సచీవాలయం ఎక్కడ ఉంటే ఏమిటని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది కానీ ఎవరిపైనా ఎలాంటి ఎఫెక్టు చూపించలేదు. సచీవాలయం పూర్తిగా తరలి వెళ్లిపోయిన నేపథ్యంలో వారం రోజుల కిందటి వరకూ సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ కింది స్థాయి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది ఉండేవారు. అయితే వారిని కూడా అక్కడ  నుంచి ప్రభుత్వం తరలించింది.

దాంతో ఖాళీ చేసిన సచివాలయంలో కనీసం తాళాలు తీసి వేసేవారు గానీ లైట్లు వేసి ఆర్పే సిబ్బందిగానీ లేకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి మరో కొత్త ప్రతిపాదన రావడంతో అసలు ఏం జరుగుతున్నదో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. అదేమిటంటే సచివాలయంలోని సి బ్లాక్ నుంచి బూర్గుల రామకృష్ణారావు భవన్ వరకూ స్కై వాకర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి.

సచివాలయంలోని సి బ్లాక్ నుంచి నేరుగా బూర్గుల రామకృష్ణారావు భవన్ వరకూ ఆకాశ మార్గం ఏర్పాటు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రెండు భవనాలకు అనుసంధానం కలుగుతుంది. ఇది సెక్యూరిటీ పరంగా కూడా బాగుంటుంది. స్కై స్ర్ర్కాపర్ లో కన్వేయర్ బెల్టు ఏర్పాటు ఉంటుంది కాబట్టి ఇది ఎస్కలేటర్ లా ఉంటుంది. అందువల్ల దానిపై ఎక్కి నిలబడితే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్లేందుకు ఎలాంటి శ్రమ లేకుండా కుదురుతుంది. ఈ ప్రతిపాదన ఎందుకు సిద్ధం చేశారో తెలియదు కానీ అనధికారికంగా వినిపిస్తునదేమంటే త్వరలో కేటీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని, అలా ఆయన బాధ్యతలు స్వీకరిస్తే సచివాలయంలోని సి బ్లాక్ లో తన కార్యాలయాన్ని కొనసాగిస్తారని అందుకే ఈ కొత్త ఏర్పాట్లు ప్రతిపాదనలు జరుగుతున్నాయని అంటున్నారు. కేసీఆర్ లాగా సచివాలయానికి రాకుండా పాలన చేయడం కేటీఆర్ లాంటి యువకుడు ఉత్సాహ వంతుడు పాలన చేయరని అందుకే సీ బ్లాక్ ను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.

Related posts

కరోనా సెకండ్ వేవ్ పై అప్రమత్తం: ట్రాఫిక్ సిబ్బంది కి సోకడంతో అలెర్ట్

Satyam NEWS

రష్యా నుంచి వచ్చిన 70 వేల ఏకే 203 ఎస్సాల్ట్ రైఫిల్స్

Satyam NEWS

ఏపిలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

Satyam NEWS

Leave a Comment