29.7 C
Hyderabad
April 29, 2024 10: 12 AM
Slider నల్గొండ

ప్రభుత్వ పథకానికి వినూత్న ప్రచారం

#SwachBharat

స్వచ్ఛ భారత్,స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ పథకాన్ని వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 18వ, వార్డు కౌన్సిలర్ కుంట ఉపేంద్ర సైదులు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావాలనే సంకల్పంతో ద్విచక్ర వాహనానికి మైక్ ఏర్పాటు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కుంట ఉపేంద్ర సైదులు మాట్లాడుతూ అక్టోబర్ 2వ, తేదీ లోపుగా మరుగు దొడ్డి లేని వారు తమ ఇంటి ఆవరణలో మరుగు దొడ్డి ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుండి 12,000 రూపాయలు అందచేస్తామని తెలిపారు.

 దీనిని సంబంధించిన దరఖాస్తులు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో లభిస్తాయని అన్నారు. ప్రజా ఉపయోగ పథకాలు ఏవైనా ప్రజలకు చేరువ అయ్యే విధంగా బైక్ ప్రచారం ద్వారా తెలియజేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు, ఆరవ వార్డు కౌన్సిలర్ ములకలపల్లి రామగోపి, 21వ,వార్డు కౌన్సిలర్ వీర్లపాటి గాయత్రి,22వ, వార్డు కౌన్సిలర్ అమరబోయిన సతీష్,

27వ, వార్డు కౌన్సిలర్ యరగని గురవయ్య, రైతు సమన్వయ సమితి కన్వీనర్ రాయల వెంకటేశ్వర్లు, గ్రంధాలయ చైర్మన్ కుంట సైదులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆన్ లైన్ విద్యపై కలెక్టర్ తో చర్చించిన దూరదర్శన్ ఎడిజి

Satyam NEWS

ముగిసిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమం

Satyam NEWS

పెట్టుబడి-పదవి-సంపాద: ఇదేనా రాజకీయం?

Satyam NEWS

Leave a Comment