Slider ముఖ్యంశాలు

సిల్లీ మాంక్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా రత్నాకర్‌రావు

#Silly Monk

హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సిల్లీ మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ స్వతంత్ర డైరెక్టర్, ఛైర్మన్ సీ. రత్నాకర్ రావును నియమించుకోవడం ద్వారా తమ డైరెక్టర్ల బోర్డును విస్తరించింది. ఆర్ధికశాస్త్రం (ఢిల్లీ, ఉస్మానియా యూనివర్శిటీలు) లో గ్రాడ్యుయేట్ అయిన రత్నాకర్ రావు, ఐఐఎం-అహ్మదాబాద్‌లో మేనేజ్‌మెంట్ విద్యనభ్యసించారు.

 మీడియా, ఎడ్వర్టయిజింగ్ రంగాలలో ఆయనకు 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. సుప్రసిద్ధ భారతీయ, అంతర్జాతీయ ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సీ నెట్‌వర్క్స్ (ఆర్‌కె స్వామి/బీబీడీఓ/డీడీబీ వరల్డ్‌వైడ్ )- ఇండియా, మిడిల్ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా, యూరోపియన్ మార్కెట్‌లలో ఆయన పనిచేశారు.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఘజియాబాద్ ) హైదరాబాద్ క్యాంపస్ లో ప్రాక్టీషనర్ ఫ్యాకల్టీగా మాత్రమే గాక ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో అకడమిక్ కౌన్సిల్ సభ్యునిగానూ సేవలందిస్తున్నారు. విభిన్న దశలలో నాలుగు సార్లు అడ్వర్టయిజింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌కు అధ్యక్షునిగానూ ఆయన సేవలనందించారు.

సిల్లీమాంక్స్ డైరెక్టర్స్ బోర్డ్ తరపున మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ రెడ్డి బోర్డులోకి రత్నాకర్ రావును స్వాగతించారు. సంబంధిత రంగాలలో అత్యున్నత గౌరవాన్ని పొందిన ఆయన సిల్లీ మాంక్స్ అభివృద్ధి కి పాటుపడతారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు.

ఈ సందర్భంగా రత్నాకర్ రావు మాట్లాడుతూ “మీడియా, వినోద రంగాలకు భవిష్యత్ బాగుంటుందని అన్నారు. సిల్లీ మాంక్స్ ఇప్పటికే అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నదని, సిల్లీమాంక్స్‌ లాంటి శక్తివంతమైన సంస్థతో పని చేయడం తన అదృష్టమని ఆయన అన్నారు.

Related posts

[Free|Sample] Male Orgasm Pills Manhood Max Male Enhancement Enlargement Powernutra

mamatha

ఇళ్ల కోసం లబ్దిదారుల వివరాలను సేకరించాలి

Satyam NEWS

విశాఖ ఉక్కు కోసం విజయసాయి పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment