37.2 C
Hyderabad
May 2, 2024 11: 43 AM
Slider కరీంనగర్

సింగాపురం వీ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల లో కొత్త కోర్సులు

#MLA Sateesh

హుజురాబాద్ మండలం సింగాపురం లోని వీ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని, వీటిని గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, వీ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల సెక్రెటరీ అండ్ కరెస్పాండెంట్ వొడితల సతీష్ కుమార్ అన్నారు.

శనివారం హుజురాబాద్ మండలం సింగాపురం లోని వీ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల లో  అడ్మిషన్లకు సంబంధించి వాల్ పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ డా. వీ వీ ఎన్  హనుమకుమార్ ఆయన మాట్లాడుతూ బీ ఏ (మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం – పొలిటికల్ సైన్స్ – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్),  బీ కామ్ సి ఏ (తెలుగు / ఇంగ్లిష్ మీడియం), 

బీఎస్సీ బీసీసీ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టామని, ఇప్పటికే బీఎస్సీ ఎంపీసీఎస్,  బీఎస్సీ బీ జెడ్ సి,  బీ ఎస్సీ ఎంపీసీ, కోర్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే ఈ ఏడాది నుండి వృత్తి విద్యా సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెడుతున్నామని, తద్వారా విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ రంగంలో కూడా వివిధ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని వివరించారు.

గ్రామీణ విద్యార్థులకు సేవాభావంతో విద్య అందించాలనే సంకల్పంతో, నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో వీ ఎస్ ఆర్ కళాశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. డిగ్రీ కోర్సుల ద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని, వివిధ రంగాల్లో తమ కెరీర్ ను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. డి

గ్రీ లో అధ్యాపకులు బోధించిన విద్య ద్వారా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ వంటివి రాసుకునే వీలుందని, అలాగే సి ఏ, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు కూడా వెళ్లొచ్చని తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న అధ్యాపకులతో విద్య బోధనా చేస్తున్నామని, వివిధ అంశాల్లో నైపుణ్యం పొంది మంచి ఉద్యోగావకాశాలు సాధించాలనే లక్ష్యంతో విద్య బోధనా జరుగుతున్నదని తెలిపారు. వివిధ పేరొందిన అధ్యాపకులచే గెస్ట్ లెక్చర్లు ఏర్పాటు చేస్తున్నామని,

అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. వివిధ రూట్లలో వచ్చే విద్యార్థులు కోసం ఉచితంగా బస్సు సౌకర్యం కూడా కల్పించామని, విద్యార్థులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని, అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించడమే వీ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాయదుర్గం వెంకటరమణ రధానికి పటిష్ట భద్రత

Satyam NEWS

ఈ ఏడాది అద్భుత ప్రగతి సాధించాం

Satyam NEWS

రక్తదానంతో మరొకరికి ప్రాణం పోద్దాం

Bhavani

Leave a Comment