29.7 C
Hyderabad
April 29, 2024 10: 21 AM
Slider ఖమ్మం

సత్తుపల్లిలో నూతన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల

#MLA Sandra Venkata Veeraiah

సత్తుపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ని పలుమార్లు కలిసి వినతి పత్రాలను అందజేసి విజ్ఞప్తి చేయగా, సత్తుపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు అనుమతులను జారీ చేస్తూ, తదుపరి చర్యలను టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు చేపట్టాలని తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సత్తుపల్లిలో అందుబాటులోకి రావడంతో అందరికీ అందుబాటులో పాలిటెక్నిక్ విద్య అందుతుందని అందరికీ ఇంజనీరింగ్ విద్యా అవకాశాలు అందుతాయని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హర్షం వ్యక్తం చేస్తూ, ఆదేశాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో విద్యార్థుల ఉజ్వల భవితకు పాలిటెక్నిక్ విద్యకు బాటలు వేసి స్వయం ఉపాధితో పాటు ఉద్యోగాలు పొందేందుకు సరైన అవకాశాలు కలుగుతాయని, ఇంజనీరింగ్ విద్య అందరికీ అందనుందని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో పాటు కోర్సులు, సిబ్బంది, ఇతర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.

Related posts

దళిత గిరిజన భూముల్ని లాక్కుంటున్న ప్రభుత్వం

Satyam NEWS

ఆంధ్రా -ఒడిశా స‌రిహ‌ద్దులో ఇద్దరు మావోల ఎన్ కౌంటర్

Satyam NEWS

రేషన్ తీసుకునేటప్పుడు సామాజిక దూరం పాటించాలి

Satyam NEWS

Leave a Comment