27.7 C
Hyderabad
April 26, 2024 06: 26 AM
Slider విజయనగరం

Raamateerdham Effect: విద్యలనగరం మొత్తం ఖాకీ మయం….!

#RaamateerdhamEffect

రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన విగ్రహ ద్వంసం పోలీసు శాఖ ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. కేసు కట్టిన నెల్లిమర్ల పోలీసులు దర్యాప్తు చేసే పనిలో ఉండగా..కొండ దిగువన గత కొద్ది రోజుల నుంచీ జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అంశాన్ని కాస్త సీరియస్ గానే తీసుకుంది.

ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాజకుమారీ… విస్తృత. బందోబస్తు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన దృష్ట్యా విజయనగరం మొత్తం ఖాకీ ల మయంగా మారింది. లా అండ్ ఆర్డర్ తో పాటు ఏఆర్ ,స్పెషల్ బెటాలియన్ పోలీసులను నగరం మొత్తం దించింది… జిల్లా పోలీసు శాఖ.

మూడు జిల్లాల నుంచీ ఎక్కడ నుంచీ అయినా ఎటువైపు నుంచీ అయినా కూడా రామతీర్థం వెళ్లకుండా ఎక్కడిక్కడ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈ నేపధ్యంలో ఎస్పీ స్వయంగా బందోబస్తు దగ్గరుండి పరిశీలించారు. ఓ వైపు నెల్లిమర్లలో బీజేపీ నేతలను రామతీర్థం వెళ్లకుండా అడ్డుకట్ట వేసారు పోలీసులు.

అదే సమయంలో రామతీర్థం వెళ్లకుండా విజయనగరం మొత్తం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వై జంక్షన్, ఎత్తు బ్రిడ్జి, కాంప్లెక్స్, బాలాజీ, కోట ,ఐస్ ఫ్యాక్టరీ, దాసన్నపేట రింగు రోడ్డు, నీళ్ల ట్యాంక్, తదితర ముఖ్య కూడళ్ల వద్ద…డీఎస్పీ మోహన్ రావు ,సీఐలు శ్రీనివాసరావు, మురళీ ,ఎస్ఐ లు భాస్కరరావు, జీయాయుద్దీన్, రాజు , ఏఎస్ఐ లు రజనీ , నూకరాజు, ఇతర సిబ్బంది బందోబస్తు లో పాల్గొన్నారు. మొత్తం నగర బందోబస్తు ను స్వయంగా ఎస్పీ రాజకుమారీ పర్యవేక్షించారు.

Related posts

ఇంకా అందని జీతాలు.. ఉద్యోగులకు తప్పని పాట్లు

Satyam NEWS

వేదశిఖర సమానుడి మహాభినిష్క్రమణం

Satyam NEWS

ప్రజా సమస్యలపై అధికారులు నిలదీసిన బాలాజీ సింగ్

Satyam NEWS

Leave a Comment