38.2 C
Hyderabad
April 29, 2024 20: 06 PM
Slider విశాఖపట్నం

8న “మా” సంస్కృతి కళాపరిషత్తు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

vizag womens

మెట్ట జానకి రామయ్య ట్రస్ట్, మా సంస్కృతి కళాపరిషత్తు ప్రారంభించి 12 వసంతాలులోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఎంవిపి కాలనీ    ఏ. ఎస్. రాజా కాలేజీ గ్రౌండ్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షురాలు లక్ష్మి భార్గవి దువ్వాడ తెలియజేశారు.

శుక్రవారం వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మొదటగా మహిళా దినోత్సవ  కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ ను వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తమ సంస్థల ద్వారా గత 11 ఏళ్ల నుంచి పేద విద్యార్థుల చదువుల కోసం, 27 మంది అనాథ విద్యార్థుల చదువుల కోసం లక్షలాది రూపాయలు వితరణ అందించి వారి జీవితాలు తీర్చేవిధంగా ఆదుకుంటున్నని తెలిపారు.

 ఇంతే కాకుండా విశాఖ నగరంలో పేద మధ్యతరగతి ప్రజల కోసం వివిధ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, సామాజిక సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలందరికీ “ప్రస్తుత సమాజంలో పురుషులతో పాటు మహిళలు సమాన స్థాయిలో ఎందుకు ఎదగలేక పోతున్నారు” అనే అంశంపై వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

ఏ వయసులో ఉన్న మహిళ అయినా ఈ అంశంపై తగిన కారణాలను, పరిష్కారాలను పది పాయింట్లుగా ఒక తెల్ల కాగితం పై రాసి వారి ఫోన్ నెంబరు చిరునామాతో పంపాలన్నారు. క్రైంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక సైకాలజిస్ట్ ద్వారా ఈ పోటీల్లో దరఖాస్తులను పరిశీలించి ఉత్తమ సమాధానానికి తెలుగు ఉగాది పర్వదినం రోజు నిర్వహించే సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో లక్ష రూపాయల మొదటి బహుమతిని అందజేస్తామని ఆమె తెలిపారు.

మిగతా వివరాలకు ఫోన్ నెంబర్ 7337059997 గాని,samskrityorg@gmail.com  కు సంప్రదించాలని కోరారు. విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి సాహిత్య, సంస్కృతి పరిరక్షణకు మా సంస్కృతి కళాపరిషత్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య వైద్యం రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యంగా పేద అనాధ పిల్లల విద్యాభివృద్ధికి ఎనలేని సేవలు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సమావేశంలో బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకులు రామేశ్వరి పాల్గొన్నారు.

Related posts

యువ ముఖ్యమంత్రి కరోనా రోగుల్ని పరామర్శించడం లేదు..ఎందుకో?

Satyam NEWS

సుఖ భోగాలకు మార్గం సౌభాగ్యాలకు ద్వారం

Satyam NEWS

రక్తపు వాంతులతో గురుకుల పాఠశాల విద్యార్థిని ఆకస్మిక మృతి

Satyam NEWS

Leave a Comment