32.2 C
Hyderabad
May 2, 2024 01: 25 AM
Slider ప్రపంచం

మానసరోవర్ యాత్రకు దేశంలో నుంచే కొత్త రోడ్డు

#manasasarovar

కైలాస-మానసరోవర యాత్ర చేపట్టేవారికి కేంద్రప్రభుత్వం తాజాగా తీపికబురు చెప్పింది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి కొత్త మార్గంలో వెళ్లి కైలాస శిఖరాన్ని దర్శించుకోవచ్చని తెలిపింది. సిక్కిం, నేపాల్‌ నుంచి చుట్టుతిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా భారతీయులు సులువుగా మానసరోవర యాత్ర చేపట్టేలా కేంద్రం కొత్త మార్గం నిర్మాణాన్ని ప్రారంభించింది. మొత్తం మూడు భాగాలుగా ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్‌ నుంచి తవాఘాట్‌ వరకు ఒక రహదారి.. తవాఘాట్‌ నుంచి ఘటియాబ్‌గఢ్‌ వరకు రెండు వరుసల రహదారి.. ఘటియాబ్‌గఢ్‌ నుంచి లిపులేఖ్‌ పాస్‌ వరకు మరో రోడ్డుమార్గం నిర్మిస్తోంది. ఇది పూర్తయితే పిథోర్‌గఢ్‌ నుంచి లిపులేఖ్‌ వరకు వాహనాల్లోనే ప్రయాణించొచ్చు.ఈ రోడ్డు నిర్మాణం పనులు దాదాపు పూర్తవ్వగా.. వాతావరణం అనుకూలిస్తే సెప్టెంబరు నాటికి రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తుందని సరిహద్దు రహదారుల సంస్థ డైమండ్‌ ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ విమల్‌ గోస్వామి వెల్లడించారు.

Related posts

పశ్చిమగోదావరిలో బీఎస్ఎన్ఎల్ ఐపీటీవీ సర్వీసు ప్రారంభం

Satyam NEWS

నా ప్రాణం నిలబెట్టిన పెద్దకొడుకువు నువ్వే సారూ….

Satyam NEWS

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచిన మేడా

Satyam NEWS

Leave a Comment