31.7 C
Hyderabad
May 2, 2024 10: 43 AM
Slider ప్రపంచం

నైజీరియా లో ఘోరం: 200 మంది చిన్నారుల‌ కిడ్నాప్

nigerian students kidnaped by terrorists


నైజీరియాలో జరిగిన దారుణమైన సంఘటన అక్కడి తల్లి దండ్రుల్లో భయం కల్గిస్తుంది. ఆ దేశం లోని ఒక పాఠ‌శాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులను ఉగ్ర‌వాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఉత్తర నైగర్ రాష్ట్రంలోని టెజీనా న‌గ‌రంలోని సలిహూ తంకో ఇస్లామిక్ పాఠ‌శాలలో చొటుచేసుకున్న ఈ సంఘటన క‌ల‌క‌లం రేపుతోంది. మారణాయుధాలతో వచ్చిన ఉగ్ర‌వాదులు పాఠశాలపై దాడి చేశారని అఈ ఘ‌ట‌న‌లో ఒక‌ వ్యక్తి మృతి చెందాడ‌ని క్క‌డి అధికారులు మీడియాకు తెలిపారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు జ‌రుపుతున్నారు. కాగా, డ‌బ్బుకోసం పాఠ‌శాల్ల‌లో ముష్క‌రులు వరుసగా దాడులకు పాల్ప‌డుతుండటం ఆందోళనకు గురిచేస్తుంది. మూడు నెల‌ల క్రితం కూడా జాంఫారా రాష్ట్రంలోని జాంగెబేకు చెందిన ఓ బోర్డింగ్ స్కూలు నుంచి 300 మంది బాలిక‌ల‌ను ముష్క‌రులు కిడ్నాప్ చేసి, అనంత‌రం విడిచిపెట్టారు. ఆరు నెల‌ల్లో ఇటువంటి కిడ్నాప్‌ ఘ‌ట‌న‌లు ఆరుసార్లు జ‌రిగాయి.విద్యార్థులకు ఎలాంటి హాని తలపెట్ట కుండా చూడాలని కిడ్నాపర్లను దేశ ప్రజలు కోరుతున్నారు.

Related posts

టీడీపీ నుంచి పోటీకి అనుమతివ్వాల్సింది చంద్రబాబే

Bhavani

వైయస్సార్ సిపి ఎజెండా  పేద ప్రజల సంక్షేమం

Satyam NEWS

జస్టిస్ వాంటెడ్: నేతన్నల హక్కుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతా

Satyam NEWS

Leave a Comment