38.2 C
Hyderabad
April 29, 2024 21: 04 PM
Slider ఆదిలాబాద్

అంగన్వాడి కేంద్రాలలో ప్రతిరోజు పౌష్టికాహారం అందాలి

#Nirmal Collector

నిర్మల్ జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు, గర్భిణీలకు ప్రతి రోజు పౌష్టికాహారం అందేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషక అభియాన్ జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు, గర్భిణీలకు ప్రతి రోజు పౌష్టికాహారం అందించాలని అన్నారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు. పోష్టికాహారం లోపం వలన 6 సంవత్సరాలలోపు 60శాంతం మంది పిల్లలు బాధపడుతున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు కలిసి తక్కువ బరువు ఉన్న పిల్లలను గుర్తించి తగిన చికిత్సలు అందించాలన్నారు. గ్రామ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు గర్బిణీలకు కెసిఆర్ కిట్ పై అవగాహన కలిపించాలన్నారు. జిల్లాలో ప్రతి అంగన్వాడీ టీచరు లైవ్ లొకేషన్ పంపే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు.

ఈ సమావేశంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రాజగోపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. వసంత్ రావు, జడ్ పి సిఈఓ సుధీర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి ప్రణిత, జిల్లా ఎస్సి అభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, జడ్పిటిసిలు రాజేశ్వర్ రెడ్డి, రామయ్య, జీవన్ రెడ్డి, రాజేశ్వర్, సాగరబాయి,రాజమణి, దీప, సిడిపిఓలు వినూత్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

విచ్చల విడిగా ఉన్న బెల్ట్ షాపులను అరికట్టాలి

Satyam NEWS

అమ్మ కొంగు

Satyam NEWS

OBC రిజర్వేషన్ల పై శ్రద్ధ చూపిన సోనియాకు కృతజ్ఞతలు

Satyam NEWS

Leave a Comment