42.2 C
Hyderabad
April 30, 2024 17: 53 PM
Slider ఆదిలాబాద్

వరద ఉధృతిపై నిర్మల్ పోలీసు శాఖ అప్రమత్తం

#Nirmal SP

నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు.

 నిర్మల్ జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, త్రెడ్ మరే ఇతర పరికరాలు అడ్డంపెట్టి సంబంధిత గ్రామాల సర్పంచులకు ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

గ్రామాల సర్పంచులతో ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు సిబ్బంది హెడ్క్వార్టర్ వదిలి వెళ్లవద్దని తెలిపారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.

మట్టి ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త

పట్టణాలలో, గ్రామాలలో మట్టితో కట్టిన పురాతన ఇండ్ల గురించి సమాచారం తెలుసుకుని, ఇండ్లు కూలే ప్రమాదంలో ఉంటే  సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారుల సహకారంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.

వరద ఉద్ధృతి ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ  హెచ్చరించి నందున ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప ఇండ్లలోనికి బయటకు రావద్దని సూచించారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఏదైనా విపత్కర సమస్య వస్తే డయల్ 100, స్పెషల్  కంట్రోల్ రూమ్ ఫ్లడ్ సిట్యుయేషన్ నిర్మల్ జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్. 9440900680 కు సమాచారం అందిస్తే తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడతామని తెలిపారు.

Related posts

నాన్నకు ప్రేమతో..

Satyam NEWS

కువైట్ లో కరోనా తో కడప జిల్లా వాసి మృతి

Satyam NEWS

రోడ్డు వెడల్పు చేయకుంటే రాజీనామా చేయండి

Satyam NEWS

Leave a Comment