37.2 C
Hyderabad
May 2, 2024 13: 11 PM
Slider మహబూబ్ నగర్

రోడ్డు వెడల్పు చేయకుంటే రాజీనామా చేయండి

#wanaparthyroad

వనపర్తి పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు చేయకుంటే పదవులకు రాజీనామా చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. రోడ్ల వెడల్పు గురించి ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా కలెక్టర్  అన్ని శాఖలతో కలిపి మీటింగ్ పెట్టుకుని పూర్తి చేస్తామని మాట ఇచ్చారన్నారు. అప్పట్లో పేదల ఇళ్లను ఏ నిధులు రాకున్నా  కోoదర్నీ ఒప్పించి, కొందరిని బలవంతంగా తీసివేసిన మున్సిపల్ కమిషనర్, చైర్మన్, వైస్ చైర్మన్, కొందరు సభ్యులు ముందుండి నడిపించారని తెలిపారు.

కానీ మూడు నెలలుగా రోడ్డు వెడల్పు పనులు ఆగిన ఏమి పట్టనట్లు మౌనంగా ఉన్నారని చెప్పారు. పనులు చేయించకుంటే ప్రజలు తిరగబడతారని, కనుక  వారికి దిశానిర్దేశం చేసి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించాలని కలెక్టర్ ను కోరారు. గతంలో అన్ని పార్టీల సభ్యులు రోడ్డు వెడల్పు చేయడానికి తీర్మానం చేశారని తెలిపారు. ఎమ్మెల్యే మెగా రెడ్డి  గతంలో లాగే నిధులు వచ్చేవరకు మున్సిపల్ నిధులతో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మిగతా నిధులు తెచ్చి వనపర్తి రోడ్డు కార్యక్రమాన్ని సంపూర్తిగా పూర్తి చేయాలని కోరారు.

రోడ్డు వెడల్పు కార్యక్రమానికి ప్రజలంతా సిద్ధంగా ఉంటే పాలకులు మాత్రం నిర్లక్ష్యంగా ఉండడం బాగాలేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, టీ జే ఎస్ ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ, గాయకుడు మిద్దె నాగరాజు, శివకుమార్, రమేష్, రాములు, కళ్యాణ్  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సంక్రమణం

Satyam NEWS

టిఆర్ఎస్ ను గెలిపిస్తే కేసీఆర్ అహంకారం ఇంకా పెరుగుతుంది

Satyam NEWS

ఎన్టీఆర్ గెస్ట్ పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి

Bhavani

Leave a Comment