28.7 C
Hyderabad
April 27, 2024 05: 50 AM
Slider తూర్పుగోదావరి

ఇవేం ఎన్నికలు? :వాట్స్ యాప్ లో బ్యాలెట్ పేపర్లు

#BallotPaper

ఎన్నికలు అంటే సీరియస్ గా జరగాలి. తమాషాగా నిర్వహించేవి ఎన్నికలు కాదు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో జెడ్ పి టిసి ఎంపిటిసి ఎన్నికలలో మాత్రం చాలా తమాషాలు జరిగియి.

వైసీపీ కార్యకర్తలు తమ ఇష్టానుసారం ప్రవర్తించినా అడ్డు చెప్పేందుకు ఎన్నికల అధికారులు సాహసించలేదు. దాంతో చాలా మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి బ్యాలెట్ పేపర్ ను ఫొటో తీసి వాట్స్ యాప్ లో అందరికి పంపించారు.

నిబంధనల ప్రకారం పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్ల కూడదు. అలాంటిది సెల్ ఫోన్లు తీసుకెళ్లి బ్యాలెట్ పేపర్లపై ముద్రవేసి వాటిని ఫొటో తీసి వాట్స్ ప్ గ్రూపుల్లో పెట్టుకుంటుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.

ఇదీ ఏపిలో ఎన్నికలు జరుగుతున్న తీరు. మండపేట మండలం మారేడుబాక, రాయవరం, వెదురుపాక ఇంకా చాలా గ్రామాల్లో ఇలానే జరిగింది.

Related posts

ఆబ్సెంట్: ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల డుమ్మా

Satyam NEWS

11 వేల మంది ఉద్యోగుల తొలగింపు

Murali Krishna

గ్రాండ్ గా “రుద్రవీణ” ప్రి రిలీజ్..ఈ నెల 28 న గ్రాండ్ రిలీజ్

Bhavani

Leave a Comment