30.7 C
Hyderabad
April 29, 2024 06: 15 AM
Slider ముఖ్యంశాలు

దళిత ద్రోహి కేసీఆర్… మాయ మాటలకు మోసపోకండి..!

#bandisainjai

ఇప్పుడు ఎన్నికలు లేవు… ఓట్ల కోసం రాలేదు…ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నాము.. కేంద్ర ప్రభుత్వం దళితుల కోసం ‘బస్తీ సంపర్క్ అభియాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. దేశవ్యాప్తంగా 75 వేల ఎస్సీ గ్రామాల్లో ఈ కార్యక్రమం జరగనుందని… తెలంగాణలో ఈ కార్యక్రమం ద్వారా 5 వేల ఎస్సి కాలనీలను సందర్శించి, వారి సమస్యలను తెలుసుకోనున్నామని కరీంనగర్ ఎంపీ చెప్పారు.. వారికి కేంద్రం ఏం చేస్తుందో వివరించనున్నాం. నవంబర్ 26 వరకు ‘బస్తీ సంపర్క్ అభియాన్’ కార్యక్రమం జరగనుందని స్పష్టం చేశారు.

దళితులకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తున్నది భారతీయ జనతా పార్టీనే. కేంద్రంలో 12 మంది దళిత ఎంపీలను మంత్రులను చేసిన ఘనత బిజెపి దే. మీకు వాస్తవాలు చెప్పేందుకే ఇక్కడికి వచ్చానని.. కెసిఆర్ కు తెలిసింది కుట్రలు, కుతంత్రాలేనని సంజయ్ తీవ్రంగా ఆరోపించారు.దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది?.. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు ఎంతమందికి వచ్చింది.?.. కరోనా సమయంలో పేదలను ఆదుకున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వమేనని ఉచిత బియ్యం, ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని… దళిత వ్యతిరేకి కేసీఆర్. ఆయన చెప్పే మాయ మాటలకు మోసపోవద్దని అన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు. ప్రతి ఒక్కరి నెత్తిపై లక్షా 20వేల అప్పు పెట్టాడని.. తెలంగాణను అప్పుల కుప్పచేసి, ప్రజల చేతికి చిప్పనిచ్చిండని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇలానే కొనసాగితే ప్రజలు రోడ్డెక్కి అడుక్కుతినాల్సిన పరిస్థితి వస్తుంది. పేదోళ్లంతా ఒక్కటి కావాలి. ఇంకెన్నాళ్లీ బాంచన్ బతుకులు?అని. మనమంతా అంబేద్కర్ వారసులం తెగించి కొట్లాడదాం రండని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్ దళిత ద్రోహి అని.. తాను మాత్రం 100 రూంల ఇల్లు కట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.  టీఆర్ఎస్ ను తెలంగాణ పొలిమేర దాకా తరిమికొట్టండి. ఇప్పటి వరకు కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపి పార్టీలకు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. ఒక్కసారి బిజెపి కి అవకాశం ఇవ్వండని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోరారు.

Related posts

వైసీపీ విజయగర్వం…అంతలోనే విషాదం.. చంద్రబాబుపై ఉక్రోషం

Satyam NEWS

రష్యా అతి పెద్ద యుద్ధ నౌకను ముంచేసిన ఉక్రెయిన్

Satyam NEWS

చేర్యాల డివిజన్ కోసం ఉద్యమిస్తున్న కోమటిరెడ్డి

Satyam NEWS

Leave a Comment