38.2 C
Hyderabad
April 29, 2024 11: 49 AM
Slider శ్రీకాకుళం

జడివానలోనూ ఆగని నిత్యాన్నదాన సేవలు

#daily services

కుండపోత వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా శ్రీకాకుళం లో నిత్యాన్నదాన సేవలు కొనసాగించటం పట్ల హర్షం వ్యక్తం అవుతున్నది. నగరంలో కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా విశాఖపట్టణానికి చెందిన ఐవిఎస్ హర్ష తన జన్మదినం సందర్భంగా శ్రీకాకుళంలో రాత్రి అన్నదానానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం కురిసిన వానలు సైత పక్కనపెట్టి, జడివానలో తడుస్తూ స్థానిక శ్రీకాకుళం పాత బస్ స్టాండ్, జిల్లా పరిషత్, అరసవల్లి, ఏడు రోడ్ల కూడలిలో ఉన్న నిరు పేదలకు అన్నదాన వితరణ చేశారు.

ఈ సందర్భంగా దాతలు దయావతి, డా. గంగా ప్రియదర్శిని మాట్లాడుతూ అన్ని దానాలలో అన్నదానం గొప్పదని, శ్రీకాకుళం లో ప్రతి నిత్యం అన్న వితరణ సేవలు కోసం పలు పత్రికల ద్వారా తెలుసుకొని వచ్చామని, తమ వంతుగా పది మందికి పంచటం ఆనందంగా ఉందన్నారు.

జన్మదినాన పార్టీలకు వెచ్చించే నగదుని వృధా చెయ్యకుండా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చెయ్యాలని పిలుపునిచ్చారు. నిత్య సేవకులు మాట్లాడుతూ మిగిలిన ఆహారాన్ని వృధా చెయ్యద్దని, మాకు తెలియజేస్తే పదిమందికీ పంచుతామని సేవా సభ్యులు తెలిపారు. వివరాలకు 8790944902, 9030132877 నంబర్లకు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐవిఎస్ హర్ష తోపాటు, శ్రీకాకుళం లో నిత్యన్నదాన సేవకులు పాల్గొన్నారు.

Related posts

కొండను తవ్వి ఎలుకలు పడుతున్న కాంగ్రెస్ నాయకులు

Satyam NEWS

ఆర్థిక సహాయనికి గడువు పెంచాలి

Bhavani

సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల కోసమే ఖర్చు చేయాలి

Satyam NEWS

Leave a Comment