38.2 C
Hyderabad
April 29, 2024 12: 43 PM
Slider ఖమ్మం

సమ్మె విజయవంతానికి నోటీసులు

notices of strike success

మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశాన్ని రక్షించుకుందాం, ప్రజలను కాపాడుకుందామనే నినాదంతో 10 కేంద్ర కార్మికసంఘాల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఫెడరేషన్ ల ఆధ్వర్యంలో మార్చి 28,29 తేదీ ల్లో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం కోరుతూ ఖమ్మం జిల్లా డిపిఓ, ఏఓ  లేబర్ కమిషనర్ లకు సిఐటియు, ఎఐటియుసీ, ఐఎఫ్ టియు తదితర కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందజేశారు. అనంతరం జెఏసి నాయకులు మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రానికి ముందు ఆతర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మార్చి కార్మికులను గొడ్డు చాకిరీ చేసే బానిసలుగా మార్చారని అన్నారు. ఈ చట్టాలు మార్చ డం వల్ల సంఘం పెట్టుకునే హక్కు 8  గంటల పని విధానం, సమ్మె చేసే హక్కు కనీస వేతనం లాంటి హక్కులు గాల్లో కలిశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

75 ఏండ్ల స్వతంత్ర భారతదేశం లో ప్రజల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ ఐసి, బ్యాంకులు, రైల్వే, విమానయానం, సింగరేణి గనులు, జాతీయ రహదారులు, క్రీడా మైదానాలు, రక్షణ రంగాన్ని సైతం నేషనల్ మానిటైజేషన్ పై ఫైన్ ద్వారా కారుచౌకగా విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన మోడీ నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు. నిరుద్యోగం విలయతాండవం చేస్తుందని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన వీటిని గాడిన పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటుందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 39ల క్షల 45 వేల కోట్ల బడ్జెట్లో పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చి సంక్షేమ రంగానికి పాతిపెట్టిందని ఇదేనా దేశభక్తి అని ప్రశ్నిం చారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం నిర్వహిం చబోయే సమ్మెలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, అదేవిధంగా గ్రామ పంచాయతీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. కార్మికులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.  ఈ కార్యక్రమంలో తుమ్మా విష్ణువర్ధన్, గాదెలక్ష్మినారాయణ, జి.రామయ్య, మందా వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్, కళ్యణం వెంకటేశ్వరరావు షేక్ చానా, తదితరులు పాల్గొన్నారు

Related posts

ఆక్సిజన్‌ను కొనుక్కునే ప‌రిస్థితి రానివ్వ‌ద్దు

Satyam NEWS

ఖమ్మం జిల్లాలో 5 నామినేషన్లు

Satyam NEWS

దత్త జయంతి సందర్భంగా నగర పురవీధులలో షిర్డీ సాయినాథుని భిక్షాటన

Satyam NEWS

Leave a Comment