ప్రభుత్వ జూనియర్ కళాశాల బిచ్కుంద జాతీయ సేవ పథకం యన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో పుల్కల్ గ్రామంలో 7 రోజుల శీతాకాల శిబిరాన్ని యన్ ఎస్ ఎస్ పోగ్రామ్ ఆపిసర్ శ్యామ్ సన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేడు ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎయిడ్స్ ర్యాలీని యన్ ఎన్ ఎస్ వాలంటీర్స్ నిర్వహించారు.
తర్వాత ముగింపు సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులు ఏడు రోజుల అనుభవాన్ని తెలియచేశారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిచ్కుంద ఎం. పి. పి , అశోక్ పటేల్, జెడ్ పి టి సి భారతి రాజు పాల్గొన్నారు.
ఇంకా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయవ్వ సాయిరాం, వైస్ ఎంపీపీ రాజు పటేల్, పుల్కల్ సర్పంచ్ విజయలక్ష్మి భూమి శెట్టి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్యామ్ సన్, గ్రామ పెద్దలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.