28.7 C
Hyderabad
April 28, 2024 04: 42 AM
Slider నెల్లూరు

నివర్ తుఫాను బాధితులకు వి ఎస్ యు ఎన్ ఎన్ ఎస్ చేయూత

#SinhapuriUniversity

నివర్ తుఫాను వలన నిరాశ్రయులై నిరుత్సహంతో కొట్టుమిట్టాడుతున్న  గిరిజన వాసులకు మేమున్నాము అంటూ ముందుకు వచ్చారు  వి ఎస్  యు  ఎన్ ఎన్ ఎస్ హెల్ప్ ది  నీడి టీం. నెల్లూరు నగర శివారులలో వేంకటేశ్వరపురం లోని పెన్నా నది ఒడ్డున నివాసముంటున్న కుటుంబాలు సైక్లోన్ నివర్  వలన పూర్తిగా నిరాశ్రుయులైనారు.

వి ఎస్ యు ఎన్ ఎన్ ఎస్ హెల్ప్ ది  నీడి టీం  వాలంటీర్స్  సర్వే చేసి బాధిత కుటుంబాలను గుర్తించారు. వారికి దుప్పట్లను  విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు చేతుల మీదుగా అందచేశారు. ముందుగా ఉపకులపతి పెన్నా నది ఒడ్డున నివసిస్తున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారి సాదకబాధకాలను అడిగి తెలుసుకున్నారు.

  బాధితులు వారి బాధలను కష్టాలను అలాగే జరిగిన నష్టమును ఉపకులపతి కి తెలిపారు. ఈ సందర్భముగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు మాట్లాడుతూ, సాంఘిక, సామాజిక  బాధ్యతగా  విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నదని అన్నారు. నివర్ ఉధృతంగా ఉన్నసమయంలో  ఎన్ని బాధలు పడ్డారో తాము వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చూసి  ఎంతో కలత చెందామని అన్నారు.

తాము స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి, ఈ మంచి పని చేస్తున్నామని అన్నారు. నివర్ విపత్కర సమయంలో ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం  ఎంతో  చాకచక్యంగా వ్యవహరించి  అధిక నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. 

విశ్వవిద్యాలయం లోని అధ్యాపక బృందానికి  ఎంతో సామాజిక బాధ్యత ఉందని అన్నారు. అందుకు వారందరిని, హెల్ప్ ది నీడి టీంను అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, అధ్యాపకులు డా. కె. సునీత, డా. ఆర్. మధుమతి, డా. కిరణ్మయి,

ఎన్ ఎన్  ఎస్ సమన్వయ కర్త  డా. ఉదయ్ శంకర్ అల్లం,  హెల్ప్ ది నీడి టీం సభ్యులు, పార్ధసారధి, చైతన్య, హేమంత్ సింగ్, రాజేష్, కావ్య, కీర్తన, చంద్రిక, గీతికా సూర్య తేజ క్రాంతి, ప్రేమ్, లోకేష్, నాజర్ పాల్గొన్నారు.

Related posts

కోవిడ్ సమయంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సేవ అమోఘం

Satyam NEWS

రానున్న ఎన్నికల కోసం ఇప్పటినుంచే కష్టపడాలి

Satyam NEWS

మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

Leave a Comment