29.7 C
Hyderabad
May 2, 2024 04: 13 AM
Slider మహబూబ్ నగర్

రైతుల పట్టా భూమిలో రోడ్డు వేసినా పట్టించుకోని అధికారులు

#rachala

వనపర్తి జిల్లాలో  రైతుల పట్టా భూమిలో రోడ్డు వేసినా పట్టించుకోని దుస్థితిలో అధికారులు ఉన్నారని బీసీ పొలిటికల్ జెఏసి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చెప్పారు. అధికారులు నియంత కను సన్నల్లో పనిచేస్తూ తమ దగ్గరకి వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా  కోర్టుకెళ్లండని చెప్పటం ఫ్యాషన్ గా మారిందని,  తప్పని పరిస్తితుల్లో కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటే కోర్టు ఆదేశాలు కూడా అమలు చేయకుండా పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

వనపర్తి జిల్లాలోని అధికారులు  డా.బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా  కేవలం నియంత  ఆదేశాల ప్రకారమే పనిచేస్తున్నారని విమర్శించారు. వనపర్తి మండలం నాచహళ్లి గ్రామ శివారులో  సర్వే నెంబర్లు 236,237,242 లలో గల పట్టాభూమిలో అక్రమంగా వేసిన రోడ్ ను పరిశీలన చేసామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాచహళ్లి గ్రామానికి చెందిన పెద్ద కుర్మన్న, చిన్న కుర్మన్న, సాయులు, వెంకటస్వామి, వారి కుటుంబ సభ్యులకు 236,237,242 సర్వే నెంబర్లలో పట్టా భూమి ఉందని,  రైతుల పట్టా పొలంలో వారి అనుమతి లేకుండా, వారికి సమాచారం ఇవ్వకుండా కోర్టు స్టే ఇచ్చినా   రోడ్డు వేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన పాపానికి రైతులపై దాడికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

పట్టా భూమికి ఇరువైపుల 235,240 సర్వే నెంబర్లలో  ప్రభుత్వ భూమి ఉన్నందున అమాయక గిరిజనులను రెచ్చగొట్టి బీసీలపైన దాడులు చేయించడం సరికాదని, ఈ విధానం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

గిరిజన సోదరులు కూడా  వాస్తవాలు తెలుసుకోకుండా ఈ విధమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడటం మంచిది కాదని, నియంత మాట విని దౌర్జన్యాలు చేస్తే అనవసరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం గ్రహించాలని కోరారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రోడ్డు వేసుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారని, ప్రజలు కట్టిన పన్నులతో  జీతాలు తీసుకుంటున్న అధికారులు ప్రజా సమస్యలు మాత్రం పట్టకుండా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడం చేతకాకపోతే ఉద్యోగాలకు రాజీనామా చేయాలని హితవుపలికారు. జిల్లా కలెక్టర్  స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు.

ఈ ప్రాంత ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టిన నిరంజన్ రెడ్డి బీసీలనే టార్గెట్టుగా పెట్టుకుని దాడులు చేయిస్తున్నారని,  బీసీలను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోకపోతే బీసీల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు అంజన్న యాదవ్ గ్రామ ఉప సర్పంచ్ అబ్దుల్లా, వార్డు సభ్యులు రాజు, చంద్ర మౌళి,అంజి, లక్మయ్య, వెంకటయ్య, బాధిత రైతులు పెద్ద కుర్మన్న, చిన్న కుర్మన్న, సాయులు,వెంకటస్వామి,అరుణమ్మ, రుక్నమ్మ, చిట్టెమ్మ, నాగమణి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సముద్ర స్నానానికి వచ్చి యువకుడు గల్లంతు

Satyam NEWS

టూ లేట్ : సులేమానీని ఎప్పుడో చంపాల్సింది : ట్రంప్‌

Satyam NEWS

అనాధ పిల్లలకు ఆసరాగా నిలిచిన సోషల్ మీడియా

Satyam NEWS

Leave a Comment