37.2 C
Hyderabad
April 26, 2024 22: 53 PM
Slider కరీంనగర్

అనాధ పిల్లలకు ఆసరాగా నిలిచిన సోషల్ మీడియా

#MLAChoppadandi

అనాథలుగా మారిన ఇద్దరు ఆడపిల్లల్ని ఆదుకోవడానికి సోషల్ మీడియా వారధిలా పని చేస్తున్నది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఏరడు పల్లి కి చెందిన అభినయ,ఆలయ లు అనాథలు.

అయితేనేం మేమున్నాం అంటూ దాతలు ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. చందాల ద్వారా 5లక్షల రూపాయలు జమ అయ్యాయి.

వీరి కథనాన్ని సోషల్ మీడియాలో చూసి చలించిపోయి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన వంతు 10వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఎమ్మెల్యే రవిశంకర్ పిలుపునందుకొని అమెరికాలో ఉంటున్న NRI కుటుంబం పంజాల నరేష్-మధుప్రియలు వాళ్ళ వంతు 50, 000/–రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.

అదే విధంగా USA లో ఉన్న మిగతా NRI ల ద్వారా 4, 50, 000/-రూపాయలు జమ చేసారు. సోషల్ మీడియాలో చొప్పదండి సుంకె రవిశంకర్ పిలుపుతో, పిల్లలపై మానవతా దృక్పథంతో 5 లక్షల రూపాయలు జమచేసి పంపించారు.

 చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ చేతుల మీదుగా నేడు శంకరపట్నం మండలం ఏరడు పల్లి కి చెందిన అభినయ,ఆలయ లకు ఈ విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఒక పిలుపుతో ముందుకు వచ్చి సహాయం చేసిన NRI లకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మనకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీకే రామకృష్ణ,  చొప్పదండీ మార్కెట్ చైర్మన్ అరెల్లి చంద్రశేఖర్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పారుపల్లి మనోహర్, బొడిగే శ్రీనివాస్, చొప్పదండి కో ఆప్షన్ రెహ్మాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Related posts

తొలకరి

Satyam NEWS

స్వర్ణ కవచాలంకారంలో స్వయంవ్యక్త కనకదుర్గమ్మ తల్లి

Satyam NEWS

ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి ఐదుగురి గల్లంతు

Satyam NEWS

Leave a Comment