హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. 74 సంవత్సరాల వృద్ధుడు ఒకడు ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. దారుణమైన ఈ సంఘటన గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాధమిక సమాచారం ప్రకారం 74 ఏళ్ల హైదర్ అలియాస్ యూసుఫ్ ఈ దారుణానికి ఓడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఏడు సంవత్సరాల ఆ బాలికకు సంబంధీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
previous post