38.2 C
Hyderabad
April 27, 2024 16: 30 PM
Slider ఆధ్యాత్మికం

కోవిడ్19 అంతానికి చిలుకూరు లో పాదుకా పట్టాభిషేకం

chilikuru

అలనాడు శ్రీరాముని  పట్టాభిషిక్తుడ్ని  చేయాలనుకున్న సమయంలో  కైకేయి  దశరథుని రెండు వరాలు అడుగుతుంది. రాముని అరణ్యవాసం, భరతుని పట్టాభిషేకం. సీతా రాములిద్దరూ నార బట్టలతో రాజ్యాన్ని విడిచి వనవాసానికి వెళతారు. 

రాముడి అరణ్య వాసం తరువాత భరతుడు పట్టాభిషేకం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. రాముడు లేని రాజ్యం తనకు వద్దని రాముడ్ని వెతుక్కుంటూ అడవికి వెళతారు. అక్కడ రాముడ్ని బ్రతిమాలతాడు వెనక్కి రమ్మని. అయినా రాముడు అంగీకరించకపోవడంతో ఆయన పాదుకలు తీసుకుని సింహాసనం మీద పెట్టి రాజ్యం చేస్తాడు.

తండ్రి మాట జవదాటని కొడుకుగా శ్రీరామ చంద్రుడు, అన్నపై అపారమైన వాత్సల్యం వున్న తమ్ముడుగా భరతుడు మనకు ఆదర్శం. అలనాడు రావణుడు నేడు కరోనా రూపంలో వచ్చాడు.

పాదుకా రాజ్యంలో రావణుడు అంతం అయ్యాడు. అలాగే కోవిడ్ 19 కూడా పాదుకా రాజ్యంలో అంతం అవ్వాలని కోరుతూ నేడు చిలుకూరు బాలాజీ టెంపుల్ లో పాదుకాపట్టాభిషేకాన్ని నిర్వహించారు.

Related posts

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

Satyam NEWS

దళిత బంధు పథకం దళితులు జీవితాలలో వెలుగులు

Satyam NEWS

గవర్నర్ ను తీవ్రంగా అవమానించిన అధికార టీఆర్ఎస్

Satyam NEWS

Leave a Comment