29.7 C
Hyderabad
May 3, 2024 05: 12 AM
Slider నల్గొండ

ఈనెల 26న,చలో రాజభవన్ జయప్రదం చేయండి

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా సమావేశము తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దుగ్గి బ్రహ్మం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఒక్కవంతుల కోటేశ్వరావు పాల్గొని మాట్లాడుతూ నవంబర్ 26న, చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నవంబర్ 26 నాటికి అఖిల భారత స్థాయిలో రైతు సంఘాల ఐక్య ఉద్యమం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. గత సంవత్సరం నవంబర్ 19న, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు గొప్ప విజయం సాధించారని కోటేశ్వరరావు అన్నారు.

మరికొన్ని చట్టాలకు వ్యతిరేకంగా పోరాడవలసి ఉందని,మద్దతు ధర చట్ట బద్ధతకై,విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,ఆదివాసి అటవీ సంరక్షణ నియమాలు 2022 ను రద్దు చేసుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందని అన్నారు.
దేశంలో మోడీ పరిపాలన అప్రజాస్వామిక పాలన నుండి క్రమంగా పాసిజం వైపు ప్రయాణిస్తున్నట్లుగా అనేక

అంతర్జాతీయ సంస్థలు సైతం ప్రకటిస్తున్నాయని అన్నారు.ప్రజావ్యతిరేక చట్టాల వలన రైతులు ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయల విలువను కోల్పోయారని,రైతులు పండించిన పంటలకు చట్టబద్ధత చట్టం లేకపోవడంతో ప్రతి సంవత్సరం 2.65 లక్షల కోట్ల రూపాయలు కోల్పోవడం జరుగుతుందని, కరెంట్ ప్రైవేటీకరణ వలన కరెంటు చార్జీలు

పెరిగిపోతున్నాయని వీటన్నిటికీ వ్యతిరేకంగా తెలంగాణ కిసాన్ మోర్చా నవంబర్ 26న,చలోరాజ్ భవన్ పిలుపు ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్,రైతు సంఘం జిల్లా నాయకుడు పల్లె వెంకటరెడ్డి,పట్టణ రైతు సంఘం అధ్యక్షుడు జక్కుల రమేష్,పట్టణ రైతు సంఘం కార్యదర్శి ఆర్ మురళి,ఐ కె ఎమ్ ఎస్ నాయకులు నూకల చంద్రం,రైతు సంఘం మండల కార్యదర్శి పిన్నపురెడ్డి వెంకటరెడ్డి,రైతు సంఘం నాయకులు పాశం వెంకటనారాయణ,ఆర్.వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

అర్చకుల సంఘీభావ సభ సుదర్శన పుస్తక ఆవిష్కరణ

Sub Editor

వనపర్తి పట్టణంలో కరెంటు అప్రకటిత కోతపై ఫిర్యాదు

Satyam NEWS

జై కిసాన్ :పొలం దున్ని, నీరు పెట్టి రైతుగా మారిన తెలంగాణ మంత్రి

Satyam NEWS

Leave a Comment