29.7 C
Hyderabad
April 29, 2024 08: 48 AM
Slider ఖమ్మం

కక్ష కార్పణ్యాలు మాని క్షమాగుణం అలవార్చుకోవాలి

#Justice Dr. Dr. T. Srinivasa Rao

మానవులంతా కక్షలు కార్పణ్యాలు మాని క్షమా గుణం అలవర్చుకోవాలని, క్షమించడం అనేది అత్యుత్తమ లక్షణమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం న్యాయసేవా సదన్ లో జాతీయ లోక్ అదాలత్ ప్రక్రియను ఆయన నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన తప్పులను పెద్ద మనసుతో క్షమించి రాజీ మార్గంలో ప్రయాణించాలని సూచించారు.

సమాజ సుఖ, శాంతులకు రాజీ మర్గమే ఉత్తమమన్నారు. కలహిస్తున్న కక్షిదారుల ముఖాలపై చిరునవ్వు చూడటమే లోక్ అదాలత్ ధ్యేయమని అన్నారు. కలహాలు లేని సమాజమే అభివృద్ధి చెందుతుందన్నారు. సత్వర న్యాయం అందుబాటులో వున్న సమాజం వున్న దేశం ప్రగతి సాధిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

ఈ సందర్భంగా శనివారం జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చొరవతో 2019 మేనెలలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో టాటా ప్రాజెక్టు లిమిటెడ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న గంగుల త్రినాధ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన తల్లిదండ్రులు, భార్య ఖమ్మం కోర్టులో భీమా కంపెనీపై కోటి రూపాయలకు కేసు దాఖలు చేశారు.

ఇట్టి కేసును జాతీయ లోక్ అదాలత్ లో రాజీకి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిపాదించారు. ఇరు పక్షాల వారిని పిలిపించి భీమా కంపెనీ వారితో రాజీకి మార్గం కల్పించి కక్షిదారులకు కోటిరూపాయల పరిహారం రాజీ మార్గం ద్వారా అవార్డు జారీ చేశారు. రోడ్లు ప్రమాదం కేసులో ఇంత పెద్ద మొత్తంలో పరిహారం లోక్ అదాలతో లబించడం తెలంగాణాలోనే ఇది ప్రథమం అని భీమా కంపెని న్యాయవాది తెలిపారు.

న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావేద్ పాషా మాట్లాడుతూ గత సంవత్సరం జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 62,587 కేసులు పరిష్కారం అవగా ఇందులో 574 సివిల్ కేసులున్నాయన్నారు.బార్ అసోసియోషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు మాట్లాడుతూ బ్యాంకు మరియు ఇతర ఆర్ధిక సంస్థలు కక్షిదారులు పట్ల ఉదారంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆర్. డేనీరూథ్, ఎన్.అమరావతి, కె.ఆశారాణి, పి.మౌనిక, ఎన్.శాంతిసోని, ఆర్. శాంతిలత, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారిణి రేణుక రాజ్ కుమార్, యూనియన్ బ్యాంకు డివిజనల్ మేనేజర్, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చొరవతో 2019 మేనెలలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో టాటా ప్రాజెక్టు లిమిటెడ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న గంగుల త్రినాధ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన తల్లిదండ్రులు, భార్య ఖమ్మం కోర్టులో భీమా కంపెనీపై కోటి రూపాయలకు కేసు దాఖలు చేశారు.

ఇట్టి కేసును జాతీయ లోక్ అదాలత్ లో రాజీకి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిపాదించారు. ఇరు పక్షాల వారిని పిలిపించి భీమా కంపెనీ వారితో రాజీకి మార్గం కల్పించి కక్షిదారులకు కోటిరూపాయల పరిహారం రాజీ మార్గం ద్వారా అవార్డు జారీ చేశారు. రోడ్లు ప్రమాదం కేసులో ఇంత పెద్ద మొత్తంలో పరిహారం లోక్ అదాలతో లబించడం తెలంగాణాలోనే ఇది ప్రథమం అని భీమా కంపెని న్యాయవాది తెలిపారు.

Related posts

టీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన ఈటల రాజేందర్

Satyam NEWS

సంవత్సరానికి కోటి ఉద్యోగాలు అన్న బిజెపి వాగ్ధానం ఏమైంది?

Satyam NEWS

ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ లో విద్యార్థులకు కళ్ళద్దాలు పంపిణీ

Satyam NEWS

Leave a Comment