40.2 C
Hyderabad
April 29, 2024 15: 40 PM
Slider పశ్చిమగోదావరి

గోదావరి వరద ప్రాంతాలను సందర్శించిన పశ్చిమగోదావరి ఎస్ పి

#eluru police

రాబోయే వర్షా కాలంలో గోదావరి నది కి వరదలు వస్తే మునిగిపోయే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె నారాయణ్ నాయక్ సూచించారు.

ఈ చర్యల్లో భాగంగా నేడు ఆయన పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆకస్మికంగా పర్యటించి ప్రాజెక్ట్ ప్రాంతములో నిర్మించిన కాపర్ డాం నిర్మాణం ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని  రానున్న వరద నీటి వలన కలిగే అనర్థాలను గురించి తెలుసుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను కాపాడాలని ఆయన సూచించారు.

లోతట్టు ప్రాంతాలు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవిన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు.

లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు గురించి అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.

జిల్లా ఎస్పి తో బాటు పోలవరం డిఎస్పీ లత కుమారి, పోలవరం సిఐ ఏ.ఎన్.ఎన్ మూర్తి, ఎస్ఐ శ్రీనివాస్ ప్రాజెక్ట్ అధికారులు, రెవిన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

హోటల్లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం ఆరా

Satyam NEWS

ఆర్య వైశ్యులకు ఉచితంగా కరోనా మందు పంపిణి

Satyam NEWS

భారత్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని పాక్ డిమాండ్

Satyam NEWS

Leave a Comment