30.7 C
Hyderabad
April 29, 2024 04: 45 AM
Slider కవి ప్రపంచం

బతుకు యుద్ధంలో…

#shyamalanew

అలనాడు ఝాన్సీ లక్ష్మీబాయి

రౌద్ర లక్ష్మి అయి

వీపున కన్నబిడ్డతో

సమర రంగాన స్వైర విహారం చేస్తే

నేడు ఈ పేద తల్లి

బిడ్డను నడుముకు కట్టుకుని

ఇక్కట్లకు వెరవక

ఇటుకలు మోస్తూ

బతుకు యుద్ధమే చేస్తోంది

రాణి అయినా..పేదరాలయినా

అమ్మ హృదయం

అనంత ప్రేమ నిలయం

ఎంత బరువు మోస్తున్నా

కన్నబిడ్డ భారం కాదామెకు

‘ చిత్రం ‘ ! పసిబిడ్డ  పరికిస్తోంది తల్లినే

మరి ..అమ్మ కష్టం బిడ్డ గ్రహించేనా?

పెద్దయి.. అమ్మకు అండగ నిలిచేనా?

అయినా..

అమ్మ అమృత హృదయం

ఆశించదు ఏ ప్రతిఫలం!

జె. శ్యామల

Related posts

భారత్ ముస్లింలు ఒక ప్రత్యేక పార్టీ పెట్టుకుంటే మేలు

Satyam NEWS

కొమరం భీం స్పూర్తితో ఆదివాసీలు ఉద్యమించాలి

Satyam NEWS

మూడు వేలకు పైగా బ్లాక్ మనీ…. ఎవరిది ఇది?

Satyam NEWS

6 comments

Gannavarapu Narasimha Murty June 14, 2022 at 5:42 PM

రచయిత్రి శ్యామల గారి అమ్మ మీద వ్రాసిన కవిత చాలా అద్భుతంగా ఉంది
అభినందనలు

Reply
Pushpa June 14, 2022 at 6:44 PM

Rachana bagundi madum

Reply
Dr.Ch.Nagamani June 15, 2022 at 9:37 PM

A heart touching description of selfless and unconditional love of a mother. Congratulations to Smt. Syamala.

Reply
Ramalakshmi Malladi June 14, 2022 at 5:48 PM

?

Reply
J GuruPrasad June 14, 2022 at 5:53 PM

Excellent narration by smt Shyamala garu
From J GuruPrasad

Reply
Dondapati Krishna June 14, 2022 at 5:54 PM

very nice poem.
last two lines simply superb

Reply

Leave a Comment