28.7 C
Hyderabad
April 26, 2024 09: 40 AM
Slider మెదక్

తెలంగాణ లో ఆక్సిజన్ కొరత లేకుండా చేస్తున్నాం

#ministerharishrao

జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో మహీంద్ర కంపెనీ  ఆధ్వర్యంలో ఆక్సిజన్  జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో 500  మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కాని 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉంది‌. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల నుండి తెప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డాం. ఈ పరిస్థితి గమనించి‌ సీఎం కేసీఆర్ 500 మెట్రిక్ టన్నులకు  ఆక్సిజన్ ఉత్పత్తి  పెంచాలని ఆదేశించారు. ప్రస్తుతం‌ 300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కి చేరుకున్నాం. మరో2౦౦ మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు  అగ్రిమెంట్ చేసుకున్నాం. త్వరలో ఇది ప్రారంభమవుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో 27  వేల పడకలు ఉంటే ప్రతీ పడకకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండదని ఆయన అన్నారు.

Related posts

ములుగు ఎస్పి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు

Satyam NEWS

వదల బొమ్మాళీ నిన్నొదల: ఈటల నెత్తిన మరో పిడుగు

Satyam NEWS

సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మ‌ల్లేశ్ ఇక లేరు

Satyam NEWS

Leave a Comment