37.2 C
Hyderabad
April 30, 2024 13: 16 PM
Slider తూర్పుగోదావరి

రాగి చెంబుతో రైస్ పుల్లింగ్ చేసే ముఠా గుట్టు రట్టు

#eastgodavaripolice

రైస్ పుల్లింగ్ అనే పేరుతో రాగి బిందె రాగి చెంబు చూపించి ఇవి కోట్ల రూపాయల విలువ చేస్తాయని నమ్మబలికి ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ వీటిని కొంటుందని ప్రజలను మోసం చేస్తున్న ముఠా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక పోలీస్ స్టేషన్లో వెలుగు చూసింది.

పెద్దాపురం డి.ఎస్.పి అరిటకుల శ్రీనివాస్, జగ్గంపేట సి ఐ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ జగ్గంపేట శ్రీ రామ నగర్ కాలనీకి చెందిన పచ్చితాల రవిశంకర్ కుమార్, గోకవరం కు చెందిన కంబాల మురళి, ఠాకూర్ పాలెం కు చెందిన మల్లా కామేష్, తంటికొండ గ్రామానికి చెందిన రాంబాబు. 

ఈ నలుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి అమాయక ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసే క్రమంలో పోలీసులకు పట్టుబడటం జరిగింది. అయితే ఈ నలుగురిలో పచ్చి తాల రవిశంకర్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడి మిగతా ముగ్గురు తప్పించుకోవడం జరిగింది.

ఆ ముద్దాయిని శనివారం జగ్గంపేట పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశ పెట్టడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఈ నలుగురు కలిసి తాళ్ళరేవు మండలం చిన్న వలస గ్రామానికి చెందిన  పెసంగి నూకరాజు అతని స్నేహితులు చేపరాల శేష సాయిలను ఒక్కొక్కరి దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని మోసపోయి వారు లబోదిబోమంటూ జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఫిర్యాదు స్వీకరించిన జగ్గంపేట ఇంచార్జ్ ఎస్ఐ తిరుపతి రావు జగ్గంపేట సి ఐ బి సూర్య అప్పారావు వారి సిబ్బందితో ముద్దాయిల గురించి దర్యాప్తు చేయగా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామం శివారు టైల్స్ ఫ్యాక్టరీ ఎదురుగా ఒక ముద్దాయిని అరెస్టు చేశారు అతని వద్దనుండి రైస్ పుల్లింగ్ అనే పేరుతో మోసం చేసే ఒక రాగి బిందెను, మూడు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు

మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని డిఎస్పి తెలియజేశారు ఈ సందర్భంగా మోసం చేసే మోసగాళ్ళ వలలో పడవద్దని డబ్బుల కోసం అత్యాశకు పోయి ఇటువంటి వాళ్ళ చేతుల్లో పడవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డి.ఎస్.పి అరిటాకుల శ్రీనివాస్ , జగ్గంపేట సి ఐ బి సూర్య అప్పారావు, జగ్గంపేట ఇన్ ఛార్జ్ ఎస్ ఐ తిరుపతి రావు పోలీస్ సిబ్బంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సభ్యులు పాల్గొన్నారు

Related posts

మంకు పట్టువీడని జగన్: పంచాయితీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు

Satyam NEWS

రెండవ ఏఎన్ఎం ల సమస్యలు పరిష్కరించాలి

Bhavani

సకాలంలో సీఎంఆర్ పూర్తి చేసే మిల్లర్లపై ఒత్తిడి తగ్గించే చర్యలు

Satyam NEWS

Leave a Comment