33.7 C
Hyderabad
April 29, 2024 01: 48 AM
Slider కరీంనగర్

ఇల్లంతకుంట వాగు నీటికి అఖిలపక్షం పాదయాత్ర

#Illentukunta Farmers

D2 కెనాల్ రద్దు చేసి  వెంకాట్రావుపల్లి ఓర్రే పాత తిమ్మాయి చెరువు మీదుగా జంగంరెడ్డి పల్లే ఓర్రే ద్వారా ఇల్లంతకుంట బిక్కవాగులోకి  అనంతగిరి నీటిని విడుదల చేయాలని కోరుతూ అఖిలపక్షం పాదయాత్ర నిర్వహించింది.

ఇలా చేయడం  ద్వారా సూమారు 10 గ్రామాలలో (వెంకాట్రావుపల్లి, జంగం రెడ్డి పల్లే, గోల్లపల్లి‌, అనంతారం, రహీంఖాన్ పేట, వంతడుపుల, ఇల్లంతకుంట, ముష్కానిపేట, తాళ్ళపెల్లి, గాలిపెల్లి, నర్సక్కపేట, జవారుపేట) 12వేల ఎకరాల వ్యవసాయ భూములలో భూగర్భజలాలు పెరిగి రైతాంగానికి ఉపయోగంగా ఉంటుందని ఇల్లంతకుంట ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ అఖిలపక్షం నాయకులు అన్నారు.

సుమారు 10 కిలోమీటర్ల మేరకు ఇల్లంతకుంట వాగునుండి జంగంరెడ్డి పల్లే ఓర్రే మీదుగా అనంతగిరి ప్రాజెక్టు వరకు ఓర్రలను పరీశీలిస్తూ పాదయాత్రను పుర్తి చేశారు. ఓర్రెలలో సూమారు 6చెక్ డ్యాంలు ప్రభుత్వమే నిర్మించిందని, ప్రభుత్వం D2 కెనాల్ సర్వేను రద్దు చేసి ఈ దిశగా అలోచించాలని వారు కోరారు.

MPP వుట్కూరి వెంకట రమణ రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్ రాజిరెడ్డి పాదయాత్రలోని రైతులతో మాట్లాడారు. సమస్య ను MLA  రసమయి బాలకిషన్ ద్వారా  ప్రభుత్వం దృష్టికి  తీసుకవెళ్ళి ఇల్లంతకుంట రైతుల ప్రయోజనాలు కాపాడుతుమని తెలియచేశారు.

ఈ పాదయాత్ర లో ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు, MPTC ఓగ్గు నర్సయ్య యాదవ్, ఉపసర్పంచ్ M.D సాధుల్, ఫ్యాక్స్ వైస్ ఛైర్మెన్ గోడుగు తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దోంతుల శంకర్ వార్డు సభ్యులు అంతగిరి భాస్కర్, చిట్టి ప్రదీప్ రెడ్డి, గడ్డం రమాదేవి రవి, చేరాల జయ లక్ష్మీ, కో అఫ్షన్ సభ్యులు తారెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇంకా యువజన సంఘాల అధ్యక్షుడు ఉప్పల అమర్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు ఏగుర్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంతగిరి బాలపోచయ్య, TRS గ్రామ శాఖ అధ్యక్షుడు కున బోయిన్ రఘు, ఓగ్గు రమేష్, రాజిరెడ్డి, మామిడివ నారాయణ కూడా పాల్గొన్నారు.

Related posts

లే అవుట్ల అనుమతులు గడువు లోగా ఇవ్వాలి

Bhavani

కరడుకట్టిన గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు

Bhavani

దేశ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు చేర్చిన ధ్యాన్ చంద్

Satyam NEWS

Leave a Comment