38.2 C
Hyderabad
April 29, 2024 13: 51 PM
Slider ప్రపంచం

G-7 సమ్మిట్: భారత్ కు ఆహ్వానం జర్మనీ పునరాలోచన?

#germany

జూన్‌లో నిర్వహించే గ్రూప్ ఆఫ్ సెవెన్ సమ్మిట్‌కు భారత్ ను ఆహ్వానించాలా వద్దా అనే విషయంపై జర్మనీ మల్లగుల్లాలు పడుతున్నది. సెనెగల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియాలను కూడా ఆహ్వానిస్తున్న జర్మనీ ప్రధాని మోడీని ఆహ్వానించడంలో మీనమేషాలు లెక్కపెడుతున్నది. బవేరియాలో జరిగే ఈ సమావేశానికి భారత్ ను ఆహ్వానించాలని ముందుగా అనుకున్నారు.

అయితే రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు భారత్ అంగీకరించకుండా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఉక్రెయిన్ పై పాశవికంగా దాడి చేస్తున్నందున రష్యాను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుండి బహిష్కరించాలని చేసిన ప్రతిపాదనకు భారత్ అనుకూలంగా ఓటు వేయకపోవడం ఐరోపా దేశాలకు ఆగ్రహం తెప్పించింది.

రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తామని భారతదేశం ఇప్పటికే తెలిపింది. రష్యా కూడా ఇంధన రేట్లను గణనీయంగా తగ్గించి భారత్ కు సరఫరా చేస్తున్నది. రష్యా నుంచి భారత్ ఆయుధాలను కూడా గణనీయంగా కొనుగోలు చేస్తుంది. రష్యాపై ఆంక్షలు విధించడంలో G-7 దేశాలు ముందున్నాయి. కొన్ని G-7 దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఖండించడానికి, రష్యాతో వాణిజ్యం, పెట్టుబడులపై పరిమితులు విధించడానికి G-7 దేశాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి.

Related posts

అమరావతి పై కాలు పెట్టి చేతులు కాల్చుకున్నారు

Bhavani

సేవ్ దెమ్:మయన్మార్ లో రోహింగ్యాలను రక్షించండి

Satyam NEWS

దేశంలోనే అత్యధిక ఆత్మహత్య లో వైసీపీ హయాంలోనే

Satyam NEWS

Leave a Comment