33.7 C
Hyderabad
April 30, 2024 01: 04 AM
Slider మహబూబ్ నగర్

సిజెఆర్ సమక్షంలో కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే బీరం వర్గీయులు

కొల్లాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలవడానికి గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చింతలపల్లి జగదీశ్వర్ రావు ఎంతో కృషి చేశారు. నియోజకవర్గంలో చింతలపల్లి జగదీశ్వర్ రావు కు ఓటు బ్యాంక్ చాలా వుంది.గత ఎన్నికల్లో టికెట్ రానందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డి నిలిచారు.ఆయనకు చింతల పల్లి జగదీశ్వర్ రావు తన అనుచర వర్గంతో ఓటు వేయించి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు.

ఇది జగమెరిగిన సత్యం.అయితే ఎమ్మెల్యేగా హర్షవర్ధన్ రెడ్డి గెలిచాక కొన్ని నెలలకే టిఆర్ఎస్ పార్టీ లోకి వలస వెళ్లారు. జగదీశ్వర్ రావు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకోవడానికి జగదీశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు చెప్పారు.తన అనుచర వర్గం కూడా భారీగా వచ్చింది.దానితో ఎమ్మెల్యేకు, టిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు జగదీశ్వర్ రావు.

అయితే ఇప్పుడు జగదీశ్వర్ రావు మరో షాక్ ఇచ్చారని చెప్పవచ్చు.దీనికి కొల్లాపూర్ లో జరిగిన మన ఊరు – మన పోరు రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఎఫ్ఫెక్ట్ కూడా ఉన్నది. అయితే కొల్లాపూర్ లో టిఆర్ఎస్ పార్టీ అంటే రెండు వర్గాలు ఉన్నాయి. అది మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గం.

అయితే ప్రధానంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గం నుండే కాంగ్రెస్ లోకి వస్తున్నారని సిజెఆర్ అనుచరవర్గం చెబుతుంది.మంగళవారం దాదాపు 50మందికి జగదీశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

నర్సాయి పల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారు తాళ్ల సురేష్, మహేష్, వేణుగోపాల్, హనుమంతు, భీం రెడ్డి, మల్లయ్య బయ్యా సురేష్,రమేష్,రాజు, కార్తీక్,శ్రీ రాములు, బండల రాముడు, బండారి బాలస్వామి, చింతకుంట వెంకట స్వామి, రాముడు, విజయ్ చారి, శివుడు, మంగలి నాగరాజు,జేజిని రాముడు,బయ్యా శ్రీశైలం, బాలపీరు,ఏ రామన్ గౌడ్, రవి,గొల్ల చంద్రయ్య,బి మోహన్, బి మహేష్, రవి,శ్రీకాంత్, రమేష్, మహేష్,తదితరులు ఉన్నారు. వీళ్లంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బీరం వర్గీయులే అని వారు చెబుతున్నారు.

ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి నశించాలి అంటూ నిరసనలు..

మంగళవారం మధ్యాహ్నం చింతల పల్లి జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొల్లాపూర్ పట్టణ పరిధిలో రామాపురం శివారులో గత జనవరి నెలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 50పడగల మాత శిశు ఆస్పత్రిని ప్రారంభించారు. అయితే ఆస్పత్రి ప్రారంభం చేసి రెండు నెలలు అవుతున్నా ఇంత వరకు ఆసుపత్రిలో వైద్య సేవలు నిర్వహించడం లేదు.

దీనితో మంగళవారం జగదీశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆస్పత్రిని పరిశీలించారు. ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి తోనే వైద్యసేవలు అందడం లేదని నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే పై విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు.

తక్షణమే ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని ఆస్పత్రిలో సిబ్బందిని ఏర్పాటు చేసి, వైద్య సేవలు ప్రారంభించాలని జగదీశ్వర్ రావు డిమాండ్ చేశారు.లేనియెడల శాంతియుతంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.అనంతరం కొల్లాపూర్ తాహాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

విద్యార్థులను పరామర్శించిన సిజె ఆర్

కొల్లాపూర్ పట్టణ పరిధిలోని ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.వారిని కొల్లాపూర్ నియోజక వర్గ చింతలపల్లి జగదీశ్వర్ రావు పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి దానికి సంబంధించిన వివరాలు పూర్తి గా తెలుసుకున్నారు.మెరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు. అదేవిధంగా తేనెటీగల దాడికి గురైన మధ్యప్రదేశ్ కార్మికులను జగదీశ్వర్ రావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రెటరీ జగదీశ్వర్ , కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము యాదవ్ , కోడేర్ మండల అధ్యక్షులు మిద్దె శాంతయ్య , కోడేరు కార్యనిర్వాహక అధ్యక్షులు వీరపాగా కిరణ్ కుమార్ , నర్సాయి పల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు తాళ్ల వేణుగోపాల్ స్వామి,జనం పల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకట రెడ్డి ,ముష్టి పల్లీ సర్పంచ్ కురుమయ్య, ముష్టి పల్లీ ఎంపీటీసీ ఖాజా ,కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, కొల్లాపూర్

Related posts

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు

Sub Editor

గోటబయ రాజపక్సే నివాసం లో బయటపడ్డ కరెన్సీ నోట్లు

Satyam NEWS

‘పెద్దల’ ఆశీస్సులతో యథేచ్ఛగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్

Satyam NEWS

Leave a Comment