30.7 C
Hyderabad
April 29, 2024 04: 05 AM
Slider నల్గొండ

వరి పంట సాగు వద్దంటే రైతులు ఉరి వేసుకోవాలా?

#hujurnagarcongressparty

వరి పంటపై ఆంక్షలు ఎత్తివేయాలని, ప్రభుత్వం అనాలోచిత  నిర్ణయాలని విరమించుకోవాలని టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి అజీజ్ పాషా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అజీజ్ పాషా మాట్లాడుతూ వరి పంట వేసుకునే పంట పొలాలలో  వరి వేసుకోకుండా రైతులు ఉరి వేసుకోవాలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు ధాన్యం అమ్ముకోవడానికి రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించిందని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతూ ఉంటే టోకెన్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని,ఈ వానాకాలంలో పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు 1960 రూపాయలకు కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తేమ శాతాన్ని 16 వరకు అనుమతి ఇవ్వాలని,ధాన్యం కొనుగోళ్లలో తూకంలో తరుగు పేరుతో రైతులను దోపిడీ చెయ్యొద్దని అన్నారు.

(ఎం ఎస్ పి) మద్దతు ధర కంటే ఎక్కువగానే కొనాలని అన్నారు. టోకెన్ల పంపిణీలో కూడా రాజకీయ జోక్యం కూడదని హితవు పలికారు. నెల రోజులైనా ఇంకా ప్రారంభంకాని ఐకెపి సెంటర్లని ఎద్దేవా చేశారు. అన్ని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వరి పంట పొలాల్లో రైతులు వరి వేసుకోవాలా,ఉరి వేసుకోవలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్రం మొత్తంలో రైతులు వడ్ల కుప్పలతో రైతు తిప్పలు పడుతున్నారని,అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటపై ఆంక్షలు ఎత్తివేసి,రైతులకు ధాన్యం  కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనవలసిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని   డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పిటిసి గల్లా వేంకటేశ్వర్లు,మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్  కస్తాల శ్రవణ్ కుమార్,ఎస్ కె.బిక్కన్ సాహెబ్,మేళ్లచెరువు ముక్కంటి,కోళ్లపూడి యోహాన్,కంకణాల పుల్లయ్య, గొట్టెముక్కుల రామనాథం, రాము,జగన్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మరింత పటిష్టంగా ఐసోలేషన్ వార్డుల నిర్వహణ

Satyam NEWS

విలువల అనుసరణే వావిలాలకు మనమిచ్చే ఘన నివాళి

Satyam NEWS

కేంద్రంలో రాష్ట్రంలో నిరంకుశ ప్రభుత్వాలు: రంగినేని

Satyam NEWS

Leave a Comment