37.2 C
Hyderabad
May 6, 2024 22: 51 PM
Slider గుంటూరు

విలువల అనుసరణే వావిలాలకు మనమిచ్చే ఘన నివాళి

#ambatirambabu

నిష్పక్షపాతం నిరడంబరత్వం, నిజాయితీతో కూడిన జీవన విధానం వావిలాల గోపాలకృష్ణ కే సాధ్యమైందని ..ఆయన ఆచరించిన విధానాలను అనుసరించడమే మనం ఆయానికిచ్చే ఘన నివాళియని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం వావిలాల స్మృతి వనంలో వావిలాల గోపాలకృష్ణయ్య 117వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.  వావిలాల వారసులు లీలా, మన్నవ సోడేకర్ ల తో కలిసి వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేదికపై జ్యోతి ప్రజ్వల చేశారు. ఈ కార్యక్రమానికి వావిలాల ప్రజ్వలన సేవా సంస్థ అధ్యక్షులు బండి పూర్ణచంద్రరావు అధ్యక్ష వహించారు.

ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ వావిలాలలా నిరాడంబరంగా, నిష్పక్షపాతంగా ఉండటం ఈ రోజుల్లో అందరికీ సాధ్యమయ్యే పని కాదని, అలాంటి మహనీయుల జయంతి ,వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించుకుని ఆయన విధానాలను ప్రజల్లో తీసుకెళ్లటం నైతిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

మొట్టమొదటిసారిగా వావిలాల పేరును వైయస్ రాజశేఖర్ రెడ్డి నోటి వెంట విన్నానన్నారు. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో వావిలాల గోపాలకృష్ణయ్య ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తున్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో బయటకు వచ్చి ఆయనను స్వాగతించి కార్యాలయంలోకి తీసుకెళ్లి అనంతరం వావిలాల వెంట వచ్చి సాగనంపారని.. అంతటి మహోన్నత వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య మన సత్తెనపల్లి వాడే కావడం మనకు కారణమన్నారు.

ప్రతి ఏటా అధికారికంగా వావిలాల వర్ధంతి, జయంతి

ప్రతి ఏడాది వావిలాల, జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి వారికి నివాళులర్పించేందుకు కృషి చేస్తామన్నారు. నర్సారావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ 95 ఏళ్ల వయసు వచ్చేవరకు వావిలాల గోపాలకృష్ణయ్య సుదీర్ఘ ప్రజా జీవితంలో ఉండటం గొప్ప విషయం అన్నారు. ఆరోగ్య నియమాలతో పాటు మానసిక దృఢసంకల్పన ఆయన ను ఆస్థాయికి చేర్చిందన్నారు. మహోన్నత వ్యక్తుల నుంచి వారు పాటించిన విలువల ద్వారా మనం స్ఫూర్తి పొందాలన్నారు.

మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ విషయ పరిజ్ఞానం, నిరాడంబరత్వం, పకృతితో మమేకమైన  జీవన విధానంతో  దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ వాతావరణంను గొప్పగా ప్రభావితం చేసిన వ్యక్తులలో వావిలాల ప్రముఖుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యపాన విమోచన కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో అక్షరాస్యత, మద్యపానం వ్యతిరేక ఉద్యమాలకు ఊపిరి పోసిన మహోన్నత వ్యక్తి వావిలాల గోపాలకృష్ణ అన్నారు. ఆయనతోపాటు అనేక ఉద్యమాలలో కలిసి పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

వావిలాల  మనవడు మన్నవ సోడెకర్ మాట్లాడుతూ ఇచ్చిన మాట కోసం ప్రతి ఏడాది వావిలాల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి ఆ మహోన్నత వ్యక్తి ఆశయాలను, ఆకాంక్షలను, విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరిస్తున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. వావిలాలతో గడిపిన అనుబంధాన్ని వివరించారు. విద్యార్థులు, నేటి తరం నాయకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన మనవరాలు వావిలాల సేవా సంస్థ గుంటూరు చైర్మన్ లీలా మహేశ్వరి వివరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ గీత హసంతి ,మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగూర్ మీరాన్, కోటేశ్వరరావు నాయక్, మండల కన్వీనర్లు రాయపాటి పురుషోత్తమరావు ,భవనం రాఘవరెడ్డి, ఏపూరి శ్రీనివాసరావు, కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ , దొంతి రెడ్డి శ్రీనివాసరెడ్డి నాయకులు మున్సిపల్ కమిషనర్ కొలిమి షమ్మీ ,ఎంజీఆర్ లింగారెడ్డి ,సిరిగిరి గోపాలరావు, మక్కెన అచ్చయ్య, చిట్టా విజయ భాస్కర్ రెడ్డి, బగ్గి నరసింహారావు, యూనిస్, నకరికల్లు భాష, జింకా రామారావు, వావిలాల ప్రజ్వలన సేవా సంస్థ సభ్యులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

టిఆర్ఎస్ నేత మృతి పట్ల మంత్రుల సంతాపం

Satyam NEWS

వ‌ల‌స కార్మికుల‌కు ఐకేఆర్ ఫౌండేష‌న్ ట్ర‌స్ట్ బాస‌ట‌

Satyam NEWS

అందుబాటులోకి అధిక పింఛను ఆన్లైన్ దరఖాస్తు

Murali Krishna

Leave a Comment