39.2 C
Hyderabad
May 4, 2024 22: 21 PM
Slider గుంటూరు

చంద్రబాబు పర్యటనలో పెయిడ్ కూలీల నిరసనలు

#potulabalakotaiah

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  రాయలసీమకే కాదు, రాష్ట్రానికే ద్రోహి అని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  కర్నూలు పర్యటనలో వైకాపా పెయిడ్ కూలీల చేత మూడు రాజధానులకు అనుకూలంగా అల్లర్లకు పాల్పడటం ప్రభుత్వ అవివేకం అని అన్నారు.

అమరావతే రాష్ట్ర ఏకైక రాజధాని అని ప్రజలంతా చేతులెత్తి చెబుతున్నారని, ఇందుకు భయపడి పేమెంట్ ప్లీడర్లను పోగేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారని ఆరోపించారు. అమరావతి ఏకైక రాజధాని అన్న చంద్రబాబు రాయలసీమ ద్రోహి అయితే, మూడు ప్రాంతాల ఐక్యతకు చిచ్చుపెట్టి,రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ద్రోహి కాదా? అని ప్రశ్నించారు.

అమరావతి నిర్మాణం జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఒక రాజధాని సరిపోదు, మూడు రాజధానుల  కావాలని ఎందుకు మాట్లాడలేదని పేర్కొన్నారు. ఇల్లు, కార్యాలయం అమరావతిలోనే కట్టుకున్నానని అబద్ధాలు చెప్పిన సీఎంను ఏమని పిలవాలి ? అని నిగ్గదీసారు. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకొని, హైకోర్టు తీర్పును గౌరవిస్తామని, సిఆర్డీఎ అమలు చేస్తామని అఫిడవిట్ దాఖలు చేసి, మళ్ళీ మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య కుంపట్లు పెట్టడం, బడి పిల్లలను వీధుల్లోకి తీసుకురావటం మూడు ప్రాంతాలను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు.

రహదారులు వేయలేని, కాల్వలు బాగు చేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులతో ఏం చేస్తారని ఎద్దేవా చేశారు.  మూడున్నరేళ్ళలో 8లక్షల కోట్లకు అప్పులు  చేసి నెంబర్ వన్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని గుర్తు చేశారు. మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, మరో ఏడాదిన్నరలో జరిగే ఎన్నికల్లో చలి కాగుదామనుకుంటున్నట్లు చెప్పారు. మూడు ప్రాంతాల ప్రజలు సమైక్యంగా ముఖ్యమంత్రి విభజన రాజకీయాలను తిప్పి కొట్టాలని, లేకపోతే రాష్ట్రం మరో విభజన దిశగా అడుగులు పడే ప్రమాదం లేకపోలేదని బాలకోటయ్య  హెచ్చరించారు.

Related posts

వరి తెచ్చే రైతులు నిబంధనలు పాటించాలి

Satyam NEWS

రెండో భ‌ద్రాద్రిలో వైభ‌వోపేతంగా జర‌గ‌నున్న‌ శ్రీరామ‌న‌వ‌మి వేడుకలు…!

Satyam NEWS

టీడీపీ నుంచి పోటీకి అనుమతివ్వాల్సింది చంద్రబాబే

Bhavani

Leave a Comment