37.2 C
Hyderabad
May 1, 2024 11: 36 AM
Slider ఆధ్యాత్మికం

అక్టోబ‌ర్ 11న ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి సిరిమానోత్స‌వం

#paiditallitemple

సెప్టెంబ‌ర్ 17 నుంచి ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌: తేదీలు ఖరారు చేసిన పాల‌క మండ‌లి

ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఇల‌వేల్పు, ఇష్ట‌దైవం అయిన‌ శ్రీ‌శ్రీ పైడిత‌ల్ల‌మ్మ ఉత్స‌వాలు సెప్టెంబ‌ర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయ‌ని ఆల‌య ఈవో బి.హెచ్‌.వి.ఎస్‌.ఎన్‌. కిశోర్ కుమార్ తెలిపారు. సెప్టెంబ‌ర్ 17వ తేదీన పందిరి రాట వేయ‌టంతో ఉత్సవాల‌కు అంకురార్ప‌ణ జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.

ఉత్స‌వాలు సెప్టెంబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 02వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని వివ‌రించారు. . ఈ ఏడాది ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ఏర్పాట్లు, తేదీలు ఖ‌రారు చేస్తూ వివ‌రాలు వెల్ల‌డించారు. గడచిన రెండేళ్లుగా క‌రోనా కార‌ణంగా ఉత్స‌వాల‌ను స‌రిగా నిర్వ‌హించుకోలేక‌పోయామ‌ని, ఈ ఏడాది అంద‌రి స‌హ‌కారంతో ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.

పాల‌క మండ‌లి స‌భ్యుల స‌మ‌క్షంలో ఆల‌య ఈవోతో పాటు సిరిమాను పూజారి వెంక‌ట ర‌మ‌ణ ఉత్స‌వాల‌ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి చేప‌ట్ట‌బోయే చ‌ర్య‌ల గురించి, ఉత్స‌వాల‌షెడ్యూల్‌ను వివ‌రించారు.

ఉత్స‌వాల షెడ్యూల్‌

సెప్టెంబ‌ర్ 17న పందిరి రాట వేయుట‌

21 నుంచి మండ‌ల దీక్ష ప్రారంభం

అక్టోబ‌ర్ 13 నుంచి అర్ధ‌ మండ‌ల దీక్ష ప్రారంభం

10న తొలేళ్ల ఉత్స‌వం

11న సిరిమానోత్స‌వం

18న తెప్పోత్స‌వం

30న క‌ల‌శ జ్యోతి ఊరేగింపు

న‌వంబ‌ర్ 01న ఉయ్యాల కంబాల ఉత్స‌వం

02వ తేదీన చంఢీహోమం, పూర్ణాహుతి, దీక్ష విర‌మ‌ణ‌.

సమావేశంలో పాల‌క మండ‌లి స‌భ్యులు పి. వెంక‌ట‌రావు, టి. సురేష్ కుమార్‌, పెత్సా శ్రీ‌నివాస‌రావు, బ‌లివాడ పార్వ‌తి, ఆర్‌. సూర‌మ్మ‌, ఎస్‌. అచ్చిరెడ్డి, న‌క్కా జ్యోతి, చిల్లా పుష్ప‌, గంధం లావ‌ణ్య‌, చిట్టేళ్ల విశాలాక్షి దేవాదాయ శాఖ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

ఏపీఎస్ఆర్టీసీ లో తగ్గిన సరుకుల రవాణా చార్జీలు

Satyam NEWS

రాజ్యాంగ ఉల్లంఘన దిశగా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం

Satyam NEWS

త్వరలో కామన్ మొబిలిటీ కార్డు

Satyam NEWS

Leave a Comment