28.7 C
Hyderabad
April 28, 2024 09: 38 AM
Slider ప్రపంచం

పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు షురూ

#arifalvi

సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తేదీలను ప్రతిపాదించాలని పాకిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ బుధవారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224(2) ప్రకారం ఎన్నికలు అనివార్యం అయినందున తక్షణమే పోలింగ్ తేదీలను ఇతర షెడ్యూల్ తేదీలను ప్రతిపాదించాలని ఆయన పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ను కోరారు.

ఏప్రిల్ 3న ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ జాతీయ ప్రభుత్వం రద్దయిన విషయం తెలిసిందే. నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ప్రధాన మంత్రిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం పై న్యాయపరమైన అంశాలను ఒక వైపు పాకిస్తాన్ సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నది.

అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన ఆ తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు తదితర అంశాల చట్టబద్ధతపై విచారణ కొనసాగుతుండగానే పాకిస్తాన్ అధ్యక్షుడి ప్రతిపాదన చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(5)(A) మరియు ఆర్టికల్ 224(2) ప్రకారం, జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తేదీ నుండి 90 రోజుల పరిమితిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్రపతి ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

రాజ్యాంగం ప్రకారం సాధారణ ఎన్నికల తేదీని ప్రకటించేందుకు ఎన్నికల చట్టం, 2017లోని సెక్షన్ 57(1) ప్రకారం ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు అవసరమైనందున తానీ ప్రతిపాదన చేస్తున్నట్లు అధ్యక్షుడు తెలిపారు.

Related posts

గ్రూప్-4 భర్తీకి గ్రీన్ సిగ్నల్

Murali Krishna

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి: రంగినేని అభిలాష్ రావు

Satyam NEWS

ఈ నెల 31న కేబినెట్ సమావేశం

Bhavani

Leave a Comment