35.2 C
Hyderabad
April 30, 2024 23: 45 PM
Slider ప్రపంచం

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్తాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని పాకిస్తాన్‌లో నిర్వహించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు రమీజ్ రాజా సంతోషంగా ఉన్నారు. ఈ టోర్నమెంట్‌ వల్ల రెండు దశాబ్దాల తర్వాత క్రికెట్‌ పోటీ దేశానికి తిరిగి రానుంది. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ పర్యటనను న్యూజిలాండ్, ఇంగ్లండ్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఐసిసి తన ఎలైట్ టోర్నమెంట్లలో ఒకదానికి ఆతిథ్య దేశంగా పాకిస్తాన్‌ని ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందని రమీజ్ పేర్కొన్నారు.

ప్రధాన టోర్నమెంట్‌ని పాకిస్థాన్‌కు కేటాయించడం ద్వారా మా నిర్వహణ, కార్యాచరణ సామర్థ్యం, నైపుణ్యాలపై ICC విశ్వాసం వ్యక్తం చేసిందని అన్నారు. 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్ చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించలేకపోయింది.

Related posts

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రులు హరీష్, పువ్వాడ

Satyam NEWS

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపి ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS

Leave a Comment