28.7 C
Hyderabad
April 28, 2024 10: 15 AM
Slider జాతీయం

వెనక్కి తగ్గిన పళని.. అన్నాడీఎంకే సారథిగా పన్నీర్ సెల్వం

తమిళనాడు అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు విఫలయత్నం చేస్తున్న శశికళ వ్యూహాలకు చెక్‌ పెడుతూ.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి చేతులు కలిపారు. ఇద్దరి మధ్య కుదిరిన రాజీ మేరకు అనూహ్యంగా అన్నాడీఎంకే సారథ్య పగ్గాలు పన్నీర్‌సెల్వంకు దక్కాయి.

పార్టీ సమన్వయ కర్తగా పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్తగా పళనిస్వామి ఏక్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారమే ఇద్దరికి ఈ పదవులు దక్కాయి. అసెంబ్లీలో విపక్ష నేతగా వ్యవహరిస్తున్న పళనిస్వామి.. పార్టీ సారథ్య పగ్గాలను పన్నీర్‌సెల్వంకు అప్పగించారు.

అన్నాడీఎంకేను తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు శశికళ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు తెరచాటు ప్రయత్నాలతో పాటు.. బహిరంగంగానూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని పన్నీర్ సెల్వం, పళని స్వామి నిర్ణయించుకున్నారు.

Related posts

చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ తో మంత్రి కేటీఆర్ సమావేశం

Satyam NEWS

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా కెటీఆర్ జన్మదినం

Satyam NEWS

4,5 తేదీలలో ఏలూరులో హేలాపురి బాలోత్సవం

Bhavani

Leave a Comment