28.7 C
Hyderabad
April 27, 2024 06: 16 AM
Slider సినిమా

పరాన్న జీవి- రామ్ గోపాల్ వర్మ- పవర్ స్టార్

#Ramgopal Varma

జీవిత చరిత్రలు తీసి అందరికి ఏడిపిస్తున్న రామ్ గోపాల్ వర్మ జీవితం ఇప్పడు చిత్రంగా రాబోతున్నది. ఈ చిత్రం పేరు పరాన్న జీవి. టైటిల్ చూస్తే రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రాలు, వాటి ఫలితాలు, రామ్ గోపాల్ వర్మ జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు ఒక కధ గా తీసినట్లు కనిపిస్తున్నది.

ఈ చిత్రానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తీసినట్లుగా మీడియాలో వైరల్ అవుతున్నది. చిత్రం చూస్తే గానీ అసలు విషయం తెలియదు కానీ ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతున్నది.

అదే రోజు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన పవర్ స్టార్ చిత్రం కూడా విడుదల కాబోతున్నది. పవర్ స్టార్ చిత్రం లో పాత్రలు పాత్ర ధారులు పవన్ కల్యాణ్, చిరంజీవి తదితరులను పోలి ఉన్నాయి.

ఇది పవన్ కల్యాణ్ జీవిత చరిత్ర కాదని చెబుతున్న రామ్ గోపాల్ వర్మ మరి అలాంటి పోలికలే ఉన్న వారిని ఎందుకు పెట్టుకున్నారో, పవన్ కల్యాణ్ జీవితంలో జరిగిన సంఘటనల ను రిఫ్లెక్ట్ చేసే విధంగా పోస్టర్లు ఎందుకు విడుదల చేశాడో ఆయనకే తెలియాలి. ఈ చిత్రం కూడా 22న విడుదల కాబోతున్నది. ఈ రెండు చిత్రాలు కూడా ఓటిటిలోనే వస్తున్నాయి.

Related posts

ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలి

Bhavani

జాతీయస్థాయి పురస్కారం అందుకున్న డాక్టర్ గుండబాల మోహన్

Satyam NEWS

ఖమ్మం నగరాభివృద్ధి బాధ్యత నాదే..

Satyam NEWS

Leave a Comment