28.7 C
Hyderabad
April 28, 2024 04: 40 AM
Slider మహబూబ్ నగర్

USFI జాతీయ కన్వీనింగ్ కమిటీ కార్యవర్గ సభ్యునిగా పరశురాం

#sfi

భారత ఐక్య విద్యార్ధి ఫెడరేషన్ USFI అధ్యర్యంలో 19, 20, 21 తేదీలలో హనుమకొండలో జాతీయ నూతన విద్య విధానంపై జాతీయ సదస్సు నిర్వహించారు. జాతీయ సదస్సు అనంతరం, నూతన జాతీయ కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కలమూరి పరుశురాం ను జాతీయ కన్వీనింగ్  కమిటీలో కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నారు.

ఎన్నిక అనంతరం అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న జాతీయ నూతన విద్యావిధానం ద్వారా దేశంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరం అయిపోతారని అన్నారు. వారికి విద్య అందని ద్రాక్షల మారుతుందని విమర్శించారు. అందుకే దేశంలోని విద్యార్థులు, మేధావులు ఏకమై జాతీయ నూతన విద్య విధానాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అలోచించి నూతన విద్యా విధానాన్ని తక్షణమే  రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థుల్ని సమీకరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

Related posts

అరాచక శక్తులను అదుపు చేయాలి: కమలాసన్ రెడ్డి

Satyam NEWS

ఐ బౌటిక్ & స్టూడియో లుక్స్ ఫస్ట్ ఫ్యాషన్ క్యాలెండర్

Satyam NEWS

హైదరాబాద్ వరకూ వచ్చిన ఆళ్లగడ్డ పంచాయితీ

Satyam NEWS

Leave a Comment