38.2 C
Hyderabad
April 29, 2024 11: 51 AM
Slider మహబూబ్ నగర్

పట్టణ ప్రగతిని పర్యవేక్షించిన అడిషనల్ కలెక్టర్ మను

kollapur 29

పట్టణ ప్రగతి ప్రణాళికను జిల్లా అడిషనల్ కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 10,9,6,17 వార్డులలో  అదనపు కలెక్టర్ మను చౌదరి  కౌన్సిలర్ రహీం, చైర్మన్ విజయలక్ష్మి చంద్ర శేఖర చారి, కమిషనర్ వెంకటయ్యతో కలిసి పదోవ వార్డులో కాలినడకన పర్యటించారు.

పలు అంశాలను పరిశీలించారు. కావలోని కుంటా ప్రాంతంలో జరుగుతున్న ప్రణాళిక పనులను పర్యవేక్షించారు. జరిగిన పట్టణ ప్రగతికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. వార్డులోని డ్రైనేజ సమస్యను పరిశీలించారు. అనంతరం 9వ వార్డు కౌన్సిలర్ నయిం విద్యుత్ సమస్యను తెలియచేశారు.

వెంటనే విద్యుత్ ఏ ఈ తో ఫోన్ లో మాట్లాడి పిలిపించి వాటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని చెప్పారు. తదనంతరం 6వ వార్డు కౌన్సిలర్ మేకల రమ్య నాగరాజు తో కలిసి వార్డులో పర్యటించారు. పాత పోలీస్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు. డ్రైనేజ్ ఇతర సమస్యలను కౌన్సిలర్ రమ్య తెలియచేశారు.

వార్డులో జరిగిన పట్టణ ప్రగతిని చూపించారు. తదనంతరం17 వార్డుల్లో పర్యటించారు. అంతకముందు కౌన్సిలర్స్ రహీం,నయిం, చెప్పిన సమస్యలపై అదనపు కలెక్టర్ మను చౌదరి కమిషనర్ వెంకటయ్య కు కొన్ని సూచనలు ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు.

అదే విధంగా ప్రగతికి ఎలాంటి సమస్య కలగకుండా మున్సిపాలిటీకి కనీసం10 జేసీబీలు ఉండాలన్నారు. ప్రగతి కి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. గతం గురించి వదిలేసి ఇప్పుడు జరిగే  ప్రగతిపై ఫోకస్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మెన్ పెబ్బేటి కృష్ణయ్య, అన్వర్,ప్రిన్స్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Related posts

యాగ్రీ టేబెల్: చిన్న దడిగి లో రైతు అవగాహన సదస్సు

Satyam NEWS

బెయిల్ నిబంధనలను జగన్ అతిక్రమిస్తున్నారు

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు లక్షల రూపాయల విరాళం

Satyam NEWS

Leave a Comment