39.2 C
Hyderabad
April 28, 2024 12: 55 PM
Slider ఖమ్మం

పల్లె ప్రగతి స్పూర్తితోనే పట్టణ ప్రగతి కార్యక్రమం

minister puvvada 20

మన ప్రాంతం బాగుపడాలంటే ముందు ఆలోచనా విధానంలో మార్పు రావాలని అప్పుడే అనుకున్న అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి సాధించిన అద్భుత ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారని అన్నారు.

ఈ నెల 24వ తేదీ నుండి 4వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పట్టణ ప్రగతి సన్నాహక సమావేశం గురువారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పల్లె ప్రగతి అద్భుత ఫలితాలు ఇచ్చాయి.

దాని స్ఫూర్తితోనే పట్టణ ప్రగతిని తీసుకున్నారు. పవర్ వీక్ మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అనేక సమస్యలకు పరిష్కారం లభించాయి అని మంత్రి అన్నారు. తమ తమ వార్డులు బాగు చేసుకునేందుకు, మరింత వెసులుబాటుగా మారిన చట్టం ప్రకారం 5 సంవత్సరాలు గా ఉన్న రిజర్వేషన్ ను 10 సంవత్సరాలుగా చేశారని తెలిపారు.

పేదలు ఎక్కువగా ఉండే వార్డుల నుంచే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. వార్డుల వారీగా పట్టణ ప్రగతి ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా పనులు చేసుకుంటూ పోవాలి అని మంత్రి స్పష్టం చేశారు.

రానున్న మూడు నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలి. వచ్చే ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధింత సమస్యలన్నీ పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విధంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో సంబంధింత చైర్ పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని సిఎం హెచ్చరించారని మంత్రి తెలిపారు.

పచ్చదనంతో పట్టణం కళకళలాడాలి. చెత్త నిర్మూలనకు డంప్ యార్డులు ఏర్పాటు చేసుకోవాలి. అందుకు స్థలం ను గుర్తించాలి. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలి అని మంత్రి దిశానిర్దేశం చేశారు. పల్లెల్లో సర్పంచుల మాదిరిగానే పట్టణాల్లో చెట్లు పెంచే బాధ్యతను కౌన్సిలర్లు  తీసుకోవాలి. పెట్టిన మొక్కల్లో 85 శాతం బతికే బాధ్యతను వారు తీసుకోవాలి.

పల్లె ప్రగతి లో మాదిరిగానే పట్టణాలకు కూడా అవసమైనన్ని నర్సరీలను ఏర్పాటు చేయాలి. పట్టణంలో స్థలం లేకుంటే సమీప గ్రామాల్లో పట్టణానికి కలిసి ఉన్న చోట నర్సరీలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ MV రెడ్డి, ఎంపీ మలోత్ కవిత,  ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇంకా ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర రావు, హరిప్రియ, జేసి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమీషనర్ లు, వార్డు కౌన్సిలర్ లు, అధికారులు కూడా పాల్గొన్నారు.

Related posts

ఫ్లెక్సీ తొలగించమని చెప్పాం: అధికారులే బాధ్యులు

Satyam NEWS

ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా చూడటమే న్యాయ సేవాధికార సంస్థ ఉద్దేశ్యం

Satyam NEWS

క్రైస్తవ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment