26.7 C
Hyderabad
May 3, 2024 09: 08 AM
Slider ముఖ్యంశాలు

పిఆర్సి 2023 కమిటీని వెంటనే ఏర్పాటు చేయండి

#congress

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా కాంగ్రెస్ పార్టీ ద్వారా బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ,ఉద్యోగ,పెన్షన్ల కొరకై 2023 జులై 1వ,తేదీ నుండి కొత్త పిఆర్సి అమలులోకి రావాలంటే కేవలం ఇంకా 5 నెలలు గడువు మాత్రమే ఉన్నదని,కావున వెంటనే పిఆర్సి కమిటీని ప్రకటించి ఈ 5 నెలల కాలంలో కమిటీ నివేదిక తెప్పించుకొని ఈసారైనా సకాలంలో 1.07.2023 నుండి పి ఆర్ సి ని అమలు అయ్యేటట్టు చెయ్యాలని అన్నారు.

రాష్ట్రంలోని వివిధ గురుకులాలలో  అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ కు కూడా పి ఆర్ సి ని అమలు చేయాలని,వీరికి గతంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన పిఆర్సి ని వర్తింప చేయలేదని,దీనితో ప్రస్తుతం ఇస్తున్న జీతాలు మార్కెట్ ధరలకు అనుగుణంగా లేవు కనుక దీనితో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారమైందని,గతంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన పిఆర్సి ఏరియల్స్ ఇస్తూ కొత్త పిఆర్సి ని కూడా వెంటనే వర్తింపచేయాలని అజీజ్ పాషా ప్రభుత్వాన్ని కోరారు.

గత పిఆర్సి ని ఆలస్యం చేసి ఇవ్వటం వలన ప్రతి ఉపాధ్యాయుడు,ఉద్యోగి సగటున 5 నుండి 6 లక్షల నగదును ఉద్యోగులు నష్టపోయారని,పి ఆర్ సి కమిటీ ఆలస్యంగా ఏర్పాటు చేయటం, కమిటీ నివేదికను త్వరగా అమలు చేయకపోవడంతో ఉద్యోగస్థులు తీవ్ర మనోవేదనకు గురి అవుతూ నష్టపోతున్నారని అన్నారు.కస్తూరి భాయ్( కేజీబీవీ ) లలో పనిచేస్తున్న( సి. ఆర్. టి) పీజీ. సి.ఆర్.టీ లు ఇతర ఉద్యోగుల వలె బేసిక్ పే,డి ఎ,హెచ్.ఆర్.ఏ. లు వర్తింపచేసి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వలె అన్ని సౌకర్యాలు ఇవ్వాలని అజీజ్ పాషా అన్నారు.

జూనియర్,డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులను వెంటనే రెగ్యులర్ చేయాలని,దేశంలో ఏ రాష్ట్రంలో ఎవ్వరు ఎప్పుడు ఇవ్వని విధంగా పిఆర్సి బకాయిలు రిటైర్ అయ్యాక ఇస్తామని చెప్పి మరింత అగాధంలోకి నెట్టేశారని, ఇప్పుడేమో మరి పిఆర్సి కమిటీని ఏర్పాటు చేయడంలో కాలయాపన చేస్తున్నారని, వెంటనే ఉపాధ్యాయ,ఉద్యోగులకు, రాష్ట్రంలో వివిధ గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా పిఆర్సి ని వర్తింపజేసి కాంట్రాక్టు,పెన్షనర్ల కోసం సత్వరమే కమిటీ వేసి నివేదికను త్వరితగతిన పూర్తి చేసి 01.07.2023  ఫిట్మెంట్ అమలులోకి వచ్చే విధంగా చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల మల్లయ్య,ముషం సత్యనారాయణ,ఎండి రజాక్ బాబా,పి వెంకటేశ్వర్లు,జగన్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

వేగంగా సీతారామ ప్రాజెక్ట్ రివర్ క్రాసింగ్ పనులు

Sub Editor 2

20 నుంచి మంత్రులకు, ఎమ్మెల్యేలకు జర్నలిస్టుల వినతిపత్రాలు

Satyam NEWS

తెలంగాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే

Bhavani

Leave a Comment