వనపర్తి జిల్లా పెబ్బేరులోని మత్స్య కళాశాల దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం పెబ్బేరులోని పీవీ నరసింహారావు పశు వైద్యశాల ఆధ్వర్యంలోని మత్స్య కళాశాలలో రూ 4.28 కోట్లతో నిర్మించిన బాలుర హాస్టల్ భవనాన్ని రూ. 2.18 కోట్లతో నిర్మించిన మెస్ భవనాన్ని ఆయన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎంపీ రాములుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పెబ్బేరు లో కళాశాల రావడానికి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. కేబినెట్లో చర్చించి ముఖ్యమంత్రి చేత ఒప్పించి కళాశాల మంజూరుకు ఆయన ఒప్పించారని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి ఇంకా కృషి చేస్తామని మంత్రి తలసాని అన్నారు.
దేశంలోని కళాశాల ఆదర్శంగా నిలిచే విద్యార్థులు బాగా చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్య కళాశాల ద్వారా అనేక మంది విద్యార్థినీ, విద్యార్థులు లబ్ధి పొందడమే కాక ఇతర రాష్ట్రాల వారికి కూడా ఆదర్శంగా నిలవాలని అన్నారు.
సమాజానికి మత్స్యకారులు ఎలా కృషి చేస్తున్నారు మత్స్య కళాశాలలో చదివే విద్యార్థులు కూడా మంచి మేధావులు గా మారి దేశానికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ తోపాటు జడ్పిటిసి ఎంపీపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్