40.2 C
Hyderabad
April 28, 2024 18: 14 PM
Slider నల్గొండ

పల్లెలలో జరుపుకునే అతి పెద్ద పండుగ పీర్ల పండుగ

#peerfestival

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి గానుగబండ గ్రామంలోని పీర్ల చావిడి నిర్మాణానికి 1,40,000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు అందించారు

ప్రతి యేటా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో జరుగుతున్న మొహరం పండుగ వేడుకల్లో శనివారం రాత్రి ముఖ్య అతిథిగా ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు పాల్గొని మాట్లాడుతూ పల్లెల్లో ధూంధాంగా జరుపుకునే అతి పెద్ద పండుగ అని, అమరవీరుల త్యాగానికి ప్రతీక పీర్ల పండుగ అని అన్నారు.ప్రతి ఏటా ఆనవాయితీగా పీర్ల పండగను కుల మతాలకు అతీతంగా గ్రామస్తులు నేటికి అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నారని అన్నారు.మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండుగను హిందూ,ముస్లింలు సోదరభావంతో అత్యంత వైభవంగా జరుపుకుంటారని,ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో  పీర్ల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇన్చార్జి కుక్కల వెంకన్న,ముస్లిం సోదరులు పెద్దలు,యువకులు,ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

హుజూర్ నగర్ సత్యం న్యూస్

Related posts

పేదల కాలనీలు పట్టించుకోని బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్

Satyam NEWS

కోర్టులో లొంగిపోయిన కోడెల శివరామ్‌

Satyam NEWS

కిషన్ రెడ్డి ప్రకటన వెనుక అమిత్ షా వ్యూహం?

Satyam NEWS

Leave a Comment